భారత దేశ విభజన.. లక్షల మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన.. దీనిపై త్వరలో తాను అన్ని వివరాలతో పుస్తకం రాయబోతున్నానని ఆర్ఎస్‌ఎస్‌ నేత రామ్‌ మాధవ్‌ ప్రకటించారు. బ్రిటీష్‌ పాలకులు 1905లో బెంగాల్ విభజన నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు యావత్‌ దేశం ఒక్కటై ప్రతిఘటించిందని ఆర్ఎస్‌ఎస్‌ నేత రామ్‌ మాధవ్‌ గుర్తు చేసుకున్నారు. ఆ వ్యతిరేకతతో బ్రిటీష్‌ ప్రభుత్వం తమ ఆలోచనను వెనక్కి తీసుకుందని ఆర్ఎస్‌ఎస్‌ నేత రామ్‌ మాధవ్‌ తెలిపారు. ఆ తరువాత మూడు దశాబ్దాలు పూర్తి కాకుండానే దేశ విభజన జరుగుతుంటే, ప్రజలు మౌనం వహించడం వెనుక ఉన్న అంశాలన్నింటినీ తాను తన తదుపరి పుస్తకంలో విశ్లేషించినట్లు ఆర్ఎస్‌ఎస్‌ నేత రామ్‌ మాధవ్‌ చెప్పారు. 



హిందుత్వం అంటే జీవన దృష్టి అని... దాన్ని అర్ధం చేసుకోలేకపోతున్నామని అన్నారు. తాను ఇటీవల రాసిన హిందూపారడింనకు కొనసాగింపుగా మరికొద్ది రోజుల్లో ప్రజల ముందుకు పార్టిషియన్డ్‌ ఫ్రీడం పుస్తకం తీసుకురాబోతున్నానని విజయవాడలో ప్రకటించారు. భారతీయుల డీఎన్‌ఏలోనే ప్రజాస్వామ్యం ఉందన్న ఆర్ఎస్‌ఎస్‌ నేత రామ్‌ మాధవ్‌.. బ్రిటీష్‌ దేశంలోని ప్రజాస్వామ్యం కంటే మెరుగైన ప్రజాస్వామ్యాన్ని భారతదేశంలో నడుపుతున్నామని అన్నారు. 



ఓ సామాన్య వ్యక్తి భావనను సైతం ప్రభుత్వాల్లో ప్రతిఫలించాలని ఆర్ఎస్‌ఎస్‌ నేత రామ్‌ మాధవ్‌ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య దేశంలో గెలిచిన వారు విశాఖలో కావాలంటే అక్కడ, నెల్లూరులో కావాలంటే ఇక్కడ రాజధానులు పెట్టుకోవాలనుకోవడం కాదన్న ఆర్ఎస్‌ఎస్‌ నేత రామ్‌ మాధవ్‌..  ప్రజలు ఏం కావాలనుకుంటున్నారో దాన్ని ఆచరించాలని వ్యాఖ్యానించారు. ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేలా అజాదీకా అమృతోత్సవ్‌ పేరిట 75 ఏళ్ల స్వాతంత్ర్యోత్సవ వేడుకలకు దేశవ్యాప్తంగా మంచి స్పందన లభించిందని... జాతీయ పతాక రెపరెపలతో ప్రజలు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమని ఆర్ఎస్‌ఎస్‌ నేత రామ్‌ మాధవ్‌ అన్నారు.



విజయవాడలో సాహితీ సుధ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రాంమాధవ్‌ రచించిన హిందుపారడిం ఆంగ్ల పుస్తక పరిచయ కార్యక్రమ సభ జరిగింది. ఈ సభకు విజయేంద్రప్రసాద్‌ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ప్రముఖ విశ్లేషకులు డాక్టరు దుగ్గరాజు శ్రీనివాసరావు సభకు అధ్యక్షత వహించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: