గణేశ్‌ నవరాత్రి ఉత్సవాల సందడి ప్రారంభం అవుతోంది. వీధి వీధినా వినాయక విగ్రహ మండపాలు ఏర్పాటు చేసుకునే భక్తులు రెడీ అవుతున్నారు. అయితే.. మండపాలు పెట్టే వాళ్లు కొన్ని రూల్స్ తప్పకుండా పాటించాలని ఏపీ పోలీసులు చెబుతున్నారు. మండపాలు పెట్టేవారు సంబంధిత పోలీస్ స్టేషన్ లలో సమాచారం అందించాలని డీజీపి రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. అగ్నిమాపక, విద్యుత్ శాఖల అనుమతి తీసుకుని నిబంధనల ప్రకారం వినాయక చవితి  మండపాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.


మండపాల వద్ద ఇసుక ,నీళ్ళను ఏర్పాటు చేసుకోవాలని న్నారు. నిమజ్జన సమయంలో విద్యుత్ తీగలు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డీజీపి రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. విగ్రహాల ఎత్తు, బరువు, ఉత్సవం నిర్వహించే రోజుల సంఖ్య, నిమజ్జనం చేసే తేదీ, సమయం, నిమజ్జన మార్గం, విగ్రహ నిమజ్జనానికి ఉపయోగించే వాహన వివరాలను కూడా పోలీసులకు తెలియజేయాలని డీజీపి రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. పోలీసులు అనుమతించిన నిమజ్జన మార్గాలలోనే విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకొని వెళ్లాలని డీజీపి రాజేంద్రనాథ్ రెడ్డి సూచించారు.


మండపాల వద్ద   ఇతరులకు ఇబ్బంది కలగకుండా  స్పీకర్ల శబ్దం ఉండాలని డీజీపి రాజేంద్రనాథ్ రెడ్డి సూచించారు. ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లు వాడాలని డీజీపి రాజేంద్రనాథ్ రెడ్డి సూచించారు. రాత్రి సమయాల్లో మండపాల వద్ద విధిగా ఆర్గనైజింగ్ కమిటీ వారి ప్రతినిధులు కాపలా ఉండాలని.. ట్రాఫిక్ కు ఎటువంటి ఇబ్బంది రాకుండా పందిళ్లు ఏర్పాటు చేసుకోవాలని డీజీపి రాజేంద్రనాథ్ రెడ్డి సూచించారు.

 
వినాయక విగ్రహ నిమజ్జన ఊరేగింపు సమయంలో వేషధారణలు, డీజే ఏర్పాటు చేసుకోవాలంటే మాత్రం ముందుగా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని డీజీపి రాజేంద్రనాథ్ రెడ్డి సూచించారు. అయితే.. మండపాల ఏర్పాటునకు ఎలాంటి రుసుము ఏర్పాటు చేయలేదని దేవదాయ శాఖ వివరించింది. అలా రుసుం విధించినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: