చిత్తూరు జిల్లాలో తహశీల్దార్ ఆఫీసులోనే భూమి పట్టా కోసం అధికారులను వేడుకుంటూ ఓ రైతు గుండె ఆగి మరణించిన ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. న్యాయం కోసం దీక్ష చేపట్టిన ఒక సామాన్య రైతు ప్రాణాలు కోల్పోవడం మానవీయతకు మాయని మచ్చగా మిగిలిపోతుందని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా.. ఆటవిక అరాచక పాలనలో ఉన్నామా అనే సందేహం కలుగుతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్  అన్నారు.


చిత్తూరు జిల్లా జి.డి.నెల్లూరు నియోజకవర్గంలోని తిమ్మరాజు కండ్రిగ గ్రామంలో అన్యాక్రాంతమవుతున్న తన భూమి కోసం పెనుమూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన దీక్ష చేస్తున్న పి.రత్నం అనే రైతు ప్రభుత్వం అలసత్వానికి బలైపోవడం అత్యంత దురదృష్టకరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్  తెలిపారు. శ్రీ రత్నానికి చెందిన రెండెకరాల  భూమిని గత ప్రభుత్వాలలో పెద్దలు  ఇళ్ల నిర్మాణం కోసం కొంత భాగం తీసుకున్నారని.. దీనిపై  న్యాయ పోరాటం చేయగా 2009లో శ్రీ రత్నానికి అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చిందని... న్యాయస్థానం ఉత్తర్వులను అధికారులు పాటించినట్లయితే ఒక బడుగు రైతు ప్రాణాలు పోయి వుండేవి కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్  అన్నారు.


మిగిలివున్న కొద్దిపాటి భూమి కూడా ఆక్రమణలు పాలవడంతో ఆందోళనకు గురై  రెవెన్యూ అధికారులు న్యాయం చేయాలని శుక్రవారం దీక్ష చేపట్టిన శ్రీ రత్నంపై కొందరు  రెవిన్యూ ఉద్యోగులు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో ఆందోళనకు గురై అకస్మాత్తుగా మృతి చెందడం బాధాకరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్  అన్నారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు సకాలంలో స్పందించి ఉంటే ఒక రైతు ప్రాణం నిలబడి ఉండేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్  తెలిపారు.


పార్టీ జెండా ఎగురవేయడానికి ప్రయత్నిస్తే అక్రమ కేసులుపెట్టే వైకాపా ప్రభుత్వానికి  ఇటువంటి సంఘటనలను పట్టించుకునే సమయమే లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్  నిలదీశారు.ఈ సంఘటనకు భాద్యులైన వారిని కఠినంగా శిక్షించకపోతే ప్రజాస్వామ్య పరమార్ధం కలుషితమవుతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్  ఆందోళన వ్యక్తం చేశారు. తనకున్న కొద్దిపాటి భూమి కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన శ్రీ పి.రత్నం ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్  అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: