విజయవాడలో టీడీపీ నేత చెన్నుపాటి గాంధీపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఆయన కంటికి తీవ్ర గాయం కాగా.. ఆయన్ను విజయవాడ నుంచి హైదరాబాద్ ఎల్వీప్రసాద్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బలమైన రాడ్డుతో ఆయన కన్ను పొడిచేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. అయితే.. ఈ దాడిపై పోలీస్ కమిషనర్ కాంతి రానా టాటా వివరాలు వెల్లడించారు. టీడీపీ మాజీ కార్పొరేటర్ చెన్ను పాటి గాంధీపై దాడి కేసులో విచారణ జరుగుతుందని.. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుమేరకు 326, 506 r/w 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీస్ కమిషనర్ కాంతి రానా టాటా తెలిపారు.


ప్రత్యేక బృందాలు ద్వారా దర్యాప్తు చేస్తున్నామని.. ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకున్నామని పోలీస్ కమిషనర్ కాంతి రానా టాటా అన్నారు. సీసీకెమెరాల ఫుటేజ్ ను పరిశీలిస్తున్నామని.. ప్రత్యక్ష సాక్షులను విచారిస్తున్నామని పోలీస్ కమిషనర్ కాంతి రానా టాటా వివరించారు. అయితే.. ఈ దాడిలో ఎలాంటి ఆయుధాలు, ఇనుప చువ్వలు వాడలేదని పోలీస్ కమిషనర్ కాంతి రానా టాటా అంటున్నారు.  కేవలం చేతులతో దాడి జరిగిందని.. పిడికిలి గుద్దు వల్ల గాయమైందని పోలీస్ కమిషనర్ కాంతి రానా టాటా వివరించారు.


క్షణికావేశంలో కొట్టుకోవడంతోనే చెన్నుపాటి గాంధీ కంటికి గాయమైందన్న పోలీస్ కమిషనర్ కాంతి రానా టాటా.. ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్ ఇచ్చిన రిపోర్టులో కూడా చేతితో కొట్టినట్టుగానే వచ్చిందని చెప్పారు. విజయవాడలో శాంతిభద్రతల పూర్తిగా అదుపులో ఉన్నాయని పోలీస్ కమిషనర్ కాంతి రానా టాటా అంటున్నారు. గంజాయి, బ్లేడ్ బ్యాచ్, రౌడీ షీటర్లపై ఉక్కుపాదం మోపుతున్నాపని.. శాంతి భద్రతలకు వచ్చిన ఇబ్బందేమీ లేదని పోలీస్ కమిషనర్ కాంతి రానా టాటా వివరించారు.


టీడీపీ మాత్రం ఈ ఇష్యూని అంత తొందరగా వదలకూడదని నిర్ణయించింది. నగరంలో టీడీపీ నేతలకు భద్రత కరవైందని.. వైసీపీ మూకలు రెచ్చిపోతున్నాయని ఆరోపిస్తోంది. వైసీపీ రౌడీలను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: