ఏపీ అప్పుల కుప్పగా మారిందని విపక్షాలు ఘోషిస్తున్నాయి. ఇక టీడీపీ అనుకూల మీడియా కూడా ఇదే వాదన వినిపిస్తుంటుంది. కానీ.. సీఎం జగన్ మాత్రం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఢోకా లేదని అసెంబ్లీలోనే చెబుతున్నారు. మరి ఈ రెండింటిలో ఏది నిజం.. ఏది అబద్ధం.. ఈ చర్చ ఓవైపు సాగుతుండగానే.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరో వాదన తెరపైకి తీసుకొచ్చారు. జగన్ సర్కారు.. పేదల జీవన ప్రగతికి అత్యంత కీలకమైన వారి కొనుగోలు శక్తి పెరగడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

 
టీడీపీ అనుకూల పత్రికలన్నీ రాష్ట్ర అప్పుల లెక్కలపై భూతద్దంతో సూక్ష్మ పరిశీలన జరిపాయని... సీఎం వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అసెంబ్లీలో వెల్లడించిన ఆర్థిక ప్రగతి వివరాలు ఈ మీడియాకు కనిపించలేదని వైసీపీ ఎంపీ  విజయసాయి రెడ్డి విమర్శించారు. రుణభారంపై ముఖ్యమంత్రి చెప్పిన గణాంకాలపై కోడిగుడ్డుపై ఈకలు లెక్కించే’ ప్రక్రియకే ఈ పత్రికలు ప్రాధాన్యం ఇచ్చాయని.. పేదల కొనుగోలు శక్తి పెరగడానికి వైయ‌స్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ఈ మీడియా అసలు చర్చించడానికే ఇష్టపడడం లేదని వైసీపీ ఎంపీ  విజయసాయి రెడ్డి అంటున్నారు.


పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజల బ్యాంకు ఖాతాల్లోకి నగదు బదిలీ చేయడం ద్వారా రాష్ట్ర సర్కారు ఎంత మేలు చేస్తోందో మాట్లాడడానికి ఈ  పత్రికలు ముందుకు రావడం లేదని వైసీపీ ఎంపీ  విజయసాయి రెడ్డి విమర్శించారు. ఈ పత్రిక దృష్టి అంతా రుణభారం పైనే ఉందని.. కానీ.. అమ్మ ఒడి, చేయూత, చేదోడు, ఆసరా వంటి నగదు సహాయ పథకాల ద్వారా ప్రజలకు డబ్బు ఇబ్బంది లేకుండా చేస్తున్న విషయాన్ని మాత్రం పట్టించుకోవడం లేదని వైసీపీ ఎంపీ  విజయసాయి రెడ్డి అంటున్నారు.


జగన్ అధికారంలోకి వచ్చిన 9 నెలలకే కొవిడ్‌ మహమ్మారి ప్రజాజీవితాన్ని అతలాకుతలం చేసిందని.. అయినా.. అనేక సంక్షేమ పథకాల ద్వారా జనాన్ని ఆదుకున్నారని..  ఆదాయమే లేని రోజుల్లో పేదల అకౌంట్లలో డబ్బు వేసి వారి కొనుగోలుశక్తిని పెంచారని.. పేదల సంక్షేమంలో దేశంలో వైయ‌స్ జగన్‌ ప్రభుత్వం తర్వాతే ఇంకెవరైనా అనే పేరు వచ్చిందని వైసీపీ ఎంపీ  విజయసాయి రెడ్డి చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: