కేవీపీ రామచంద్రరావు.. ఒకప్పుడు వైఎస్‌రాజశేఖర్‌ రెడ్డి ఆత్మ.. వైఎస్‌ సీఎంగా ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగిన వాడు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఆయన వైఎస్సార్ ఆత్మగా చెప్పుకునేవారు.. అప్పట్లో జగన్ కంటే కేవీపీనే వైఎస్సార్‌కు ఎక్కువ క్లోజ్.. అలాంటి కేవీపీ.. వైఎస్ మరణం తర్వాత జగన్‌కు క్రమంగా దూరమయ్యారు. అందుకు అనేక కారణాలు ఉన్నాయనుకోండి. అలాంటి కేవీపీ మళ్లీ ఇన్నాళ్లకు జగన్‌ పేరెత్తారు. సీఎం జగన్‌కు కేవీపీ లెటర్ రాశారు. పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి జగన్ కు మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు లేఖ రాశారు.


పొరుగు రాష్ట్రాలు సుప్రీంకోర్టులో కేసులు వేస్తున్న నేపథ్యంలో.. ఆయా రాష్ట్రాలను ఒప్పించే బాధ్యత కేంద్రమే తీసుకోవాలని స్పష్టం చేయాలని సీఎం జగన్ కు కేవీపీ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పునర్వవస్థీకరణ చట్టంలో పోలవరం నిర్మాణ బాధ్యతను కేంద్రానికే అప్పగించినా ఆ రాజ్యాంగ బాధ్యతను మోదీ ప్రభుత్వం వదిలి వేసిందని కేవీపీ తన లేఖలో పేర్కొన్నారు. పోలవరానికి ఇతర రాష్ట్రాలను ఒప్పించే బాధ్యతను కూడా కేంద్రం వదిలి వేసిందన్న కేవీపీ... ఆ బాధ్యతను కూడా రాష్ట్రానికే వదిలేసి చోద్యం చూస్తోందని దుయ్యబట్టారు.


ఈ నెల 6న ఓడిశా రావేసిన కేసులో సుప్రీం కోర్ట్.. కేంద్రం తీరును తప్పుపట్టిందన్న కేవీపీ... భాగస్వాములతో మాట్లాడాలని సుప్రీం పేర్కొందని తెలిపారు. పోలవరం నిర్మాణ బాధ్యత తనది కాదన్నట్టుగా కేంద్రం వ్యవహరిస్తుందన్న కేవీపీ... అందుకే పొరుగు రాష్ట్రాలు మొండిగా వ్యవహరిస్తున్నాయన్నారు. పొరుగు రాష్ట్రాలను ఒప్పించే బాధ్యత తీసుకోవాలని సీఎం జగన్ కేంద్రానికి స్పష్టం చేయాలని కేవీపీ సూచించారు. ఈ విషయంలో సత్వరమే సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు.


ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం లో భాగంగా పోలవరాన్ని జాతీయప్రాజెక్ట్ గా ప్రకటించడంతో పాటు పోలవరం నిర్మాణ బాధ్యతను కేంద్రానికే అప్పగించారని, ప్రధాని మోదీ నేతృత్వంలో భాజపా ప్రభుత్వం ఈ రాజ్యాంగ బాధ్యతను వదిలివేసిందని కేవీపీ లేఖలో పేర్కొన్నారు. కాంట్రాక్టుల విషయం పక్కన పెడితే, పోలవరానికి ఇతర రాష్ట్రాలను ఒప్పించే బాధ్యత కూడా కేంద్రం వదిలి వేసిందని కేవీపీ మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

KVP