లిక్కర్  స్కామ్.. ఇప్పుడు మూడు రాష్ట్రాలను వణికిస్తోంది. దిల్లీలో మొదలైన ఈ స్కామ్ విచారణ ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనూ హాట్ టాపిక్‌గా మారింది. దిల్లీ మంత్రులతో పాటు.. తెలంగాణకు చెందిన కీలక నేతలకు ఇందులో పాత్ర ఉన్నట్టు కథనాలు వస్తున్నాయి. టీఆర్ఎస్ ఎంపీ కవితకూ.. వైసీపీ నేత విజయసాయిరెడ్డి బంధువులకూ ఇందులో పాత్ర ఉన్నట్టు వస్తున్న కథనాలు రాజకీయ కలకలం సృష్టిస్తున్నాయి.


అయితే.. ఆంధ్రప్రదేశ్లో మద్యం మాఫియాపై కేంద్రం విచారణ చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఈ అక్రమ మద్యం వ్యాపారంలో ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని, శరత్ చంద్ర రెడ్డి కంపెనీలో సి ఎఫ్ ఓ శ్రీనివాస్ కనుసన్నల్లో ఏపీ లో మద్యం సామ్రాజ్యం రాజ్యమేలుతుందని టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అంటున్నారు. ఈ లిక్కర్ స్కామ్ పై ఈడి, సి బి ఐ విచారణ చేస్తుందో అలాగే ఆంధ్రప్రదేశ్‌లో గత 40 నెలలుగా జరుగుతున్న అక్రమ మద్యం మాఫియాపై సమగ్ర విచారణ చేపట్టాలని టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు డిమాండ్ చేస్తున్నారు.


వైసీపీ ప్రభుత్వ పెద్దల హస్తంతో ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశవ్యాప్తంగా మద్యం మాఫియా సాగుతుందని టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. అక్రమ సంపాదన ధ్యేయంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ కొనసాగుతున్న ఈ దందాపై తక్షణమే విచారణ చేపట్టాలని టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. దిల్లీ స్కామ్ లో నిందితులుగా ఉన్న కంపెనీలకు చెందిన వ్యక్తులు ఆంధ్రప్రదేశ్లో అక్రమ మాఫియాలో ప్రధాన సూత్రధారులుగా వ్యవహరిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు.


దిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన అరబిందో ఫార్మా ఎండి శరత్ చంద్రారెడ్డి ని అరెస్టు చేశారని.. అరబిందో ఎం ఫార్మా కంపెనీలో సి ఎఫ్ ఓ గా ఉన్న శ్రీనివాస్ అనే వ్యక్తి ఆడాన్  పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం వ్యాపారం సాగిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు. శరత్ చంద్రారెడ్డి అరెస్టుతో ఆంధ్రప్రదేశ్‌లో మద్యం సామ్రాజ్యాన్ని  విస్తరించిన వ్యక్తి, మద్యం మాఫియాకు ప్రధాన సూత్రధారని తేటతెల్లమైందని టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: