రామగుండం ఎరువుల కర్మాగారం శంఖుస్థాపనకు వచ్చిన సిఎం కేసిఆర్‌కు... ప్రారంభోత్సవానికి ఎందుకు విముఖత చూపుతున్నారని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రాజకీయాల్లో పట్టువిడుపులు సహజమేనని... వాటిని పక్కన పెట్టి... నవంబర్ 12న జరిగే ప్రధాని కార్యక్రమానికి హాజరై... తెలంగాణ అభివృద్ధి కోసం సీఎం తన హుందాతనాన్ని నిలుపుకోవాలని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.


ఆర్‌ఎఫ్‌సిఎల్‌ను జాతికి అంకితం చేసే విషయంలో... అధికార టీఆర్ఎస్ మిత్రపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి... తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం చేస్తున్న కృషికి సహకరించాల్సిందిపోయి అర్థరహితమైన విమర్శలు చేయడం సరికాదని అన్నారు. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయాలన్న ఆలోచన కేంద్రనికి లేదని, ఆ అవసరం కూడా లేదని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సింగరేణిని ప్రైవేటు పరం చేస్తారంటూ... కార్మికుల్లో అనుమానాలు లేవనెత్తుతున్నారని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.


నిబంధనలకు లోబడి అందరికీ ఆహ్వానాలు వెళతాయని కిషన్‌రెడ్డి అన్నారు.  రాజకీయాల్లో సిద్ధాంతపరమైన వైరుధ్యాలు సహజమేనని.. కానీ దేశం, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వీటిని పక్కన పెట్టాలని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని.. అందుకు అనుగుణంగా కేంద్రం చేపడుతున్న మౌలిక వసతుల ప్రాజక్టులకు సహకరించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.


ముఖ్యమంత్రి కేసీఆర్ ఘర్షణాత్మకమైన వైఖరి వల్ల తెలంగాణకు నష్టమే తప్ప లాభం జరగదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రధాని కార్యక్రమాన్ని అడ్డుకోవాలంటూ కమ్యూనిస్టు పార్టీలు, కొన్ని సంఘాలను టీఆర్ఎస్ రెచ్చగొడుతోందని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  అన్నారు. తమ అస్తిత్వాన్ని ధ్వంసం చేస్తున్న కేసీఆర్‌తో వామపక్షాలు అంటకాగడం.. హాస్యాస్పదమని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: