శ్రీబాగ్ ఒప్పందం.. 85 ఏళ్ల క్రితం జరిగిన పెద్ద మనుషుల ఒప్పందం. మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ వచ్చిన రోజుల్లో.. రాయలసీమ వాసులు అందుకు ముందుగా ఇష్టపడలేదు. తమకు మద్రాసు నగరం చాలా దగ్గరని.. తాము తమిళ ప్రజలతోనే కలిసి ఉంటామని అన్నారు. అయితే.. తెలుగు వారమంతా కలసి ఉందామని.. కావాలంటే.. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజధానిగా కర్నూలు చేద్దామని.. అందుకు తాము అంగీకరిస్తామని ఆంధ్ర ప్రాంత నాయకులు భరోసా ఇచ్చారు. ఈ మేరకు కాశీనాధుని నాగేశ్వరరావు గృహమైన శ్రీబాగ్‌లో ఒప్పందం జరిగింది.


ఆ ఒప్పందం ప్రకారమే.. 1953లో మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం వేరైనప్పుడు రాజధానిగా కర్నూలునే చేశారు. కర్నూలులో అందుకు తగిన భవనాలు లేకపోతే.. గుడారాలు వేసుకుని మరీ రాజధానిగా ప్రకటించారు. అయితే.. ఆ తర్వాత విశాలాంధ్ర భావన రావడం.. తెలంగాణను కూడా కలుపుకుని విశాల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేయాలన్న భావన మొదలైంది. దాంతో 1956లో మొత్తం తెలుగు ప్రాంతాలతో కలిపి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటైంది. తెలంగాణలో హైదరాబాద్ మంచి నగరంగా ఉండటంతో రాజధానిని కర్నూలు నుంచి హైదరాబాద్‌కు మార్చారు.


మళ్లీ 2014లో ఆంధ్ర ప్రదేశ్ ను విభజించినప్పుడు రాజధానిగా మళ్లీ కర్నూలునే చేయాలని డిమాండ్లు వచ్చాయి. కానీ అప్పటి చంద్రబాబు సర్కారు.. రాష్ట్రానికి మధ్యలో ఉందన్న కారణంతో అమరావతిని కొత్త రాజధానిగా ప్రకటించారు. అలా తమకు అన్యాయం జరిగిందని రాయలసీమ వాసులు అంటున్నారు. ఆ తర్వాత జగన్ సర్కారు మూడు రాజధానుల ప్రతిపాదనతో కర్నూలుకు రాజధాని కాకపోయినా.. హైకోర్టు అయినా వస్తుందని కర్నూలు వాసులు ఆనందపడుతున్నారు.


కానీ ఇప్పుడు చంద్రబాబు కర్నూలుకు న్యాయ రాజధాని వద్దు అంటున్నాడని సీమ వాసులు వాపోతున్నారు. తమ పిల్లలకు ఉద్యోగాలు వద్దా? మా రైతులకు నీళ్లు వద్దా?. మా ప్రాంతం అభివృద్ధి చెందవద్దా?. మాకు భారీ ప్రాజెక్టులు వద్దా? మాకు హైకోర్టు వద్దా? అని ప్రశ్నిస్తున్నారు. . 29 గ్రామాల మేలు కోసం అక్కడి రైతులతో డ్రామా చేయిస్తూ చంద్రబాబు కథ, స్క్రీన్‌ప్లే నడిపిస్తున్నారని మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: