ఆంధ్ర ప్రదేశ్‌.. దేశంలోనే ఎక్కువ తీర ప్రాంతం ఉన్న రాష్ట్రాల్లో ఒకటి... గుజరాత్ తర్వాత ఏపీకే ఎక్కువ కోస్తా ప్రాంతం ఉంది. ఇది ఆక్వా కల్చర్‌కు బాగా అనుకూలమైన అంశం. అయినా సరే.. మన పొరుగున ఉన్న తమిళనాడు, కేరళలు కూడా ఏపీ కంటే బాగానే తీరాన్ని వినియోగించుకుంటున్నాయి. ఆక్వా కల్చర్‌ను ఓ ఉపాధి మార్గంగా మలచుకున్నాయి. ఆక్వా కల్చర్‌పై అక్కడ ఇప్పటికే యూనివర్శిటీలు ఉన్నాయి. కానీ.. ఏపీలో మాత్రం ఇప్పటి వరకూ ఆక్వా యూనివర్శిటీ లేదు.


ఇప్పుడు జగన్ సర్కారు ఆ లోటు తీరుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఆక్వా యూనివర్శిటీ ఏర్పాటు చేయబోతున్నారు. దానికి తాజాగా సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఈ ఆక్వా యూనివర్శిటీ మత్స్యకారుల జీవితాల్లో మార్పు తీసుకొస్తుంద‌ని జగన్ భావిస్తున్నారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం శుభపరిణామంగా చెప్పుకోవాలి.


ఇన్నేళ్లయినా గతంలో ఏ నాయకుడు కూడా మత్స్యకారుల జీవితాల్లోకి తొంగిచూసిన పరిస్ధితి కనిపించలేదు. మత్స్యకారుల అభివృద్ధి కోసం జగన్ ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టింది. మత్స్యకార భరోసా, డీజిల్‌ సబ్సిడీ, ఎక్స్‌గ్రేషియా ఇలా ప్రతి మత్స్యకారుడికి అన్ని పథకాలు ఈ ప్రభుత్వం అందజేస్తోంది. మత్స్యకారుల వలస ఆపేందుకు హార్బర్‌లు మంజూరు చేశారు. నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో, బాపట్ల జిల్లా నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడలో హార్బర్‌ల నిర్మాణాలు ఈ పాటికే ప్రారంభమయ్యాయి.


తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో బియ్యపుతిప్ప హార్బర్‌ నిర్మాణం ప్రారంభించారు. మవుతుంది. ఈ హార్బర్‌ నిర్మాణానికి కేంద్రం గ్రాంట్‌ ఇవ్వలేమంటే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మాణానికి కూడా సిద్ధమయ్యారు. ఆక్వారంగం  రైతుకు మంచి జరగాలని.. కచ్చితమైన ధర నిర్ణయించి రైతుకు మంచి జరగాలని, నష్టం జరగడానికి వీల్లేదని కచ్చితమైన ధరను కూడా ఇటీవల జగన్ ప్రభుత్వం నిర్ణయించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: