ఇటీవల జనసేన పార్టీ జగనన్న కాలనీల నిర్మాణంపై ఉద్యమం చేపట్టింది.. నిర్మాణంలో ఉన్న కాలనీల వద్దకు వెళ్లి ధర్నాలు చేసింది. స్వయంగా పవన్ కల్యాణ్‌ విజయనగరంలోని గుంకలాం లే ఔట్‌ను సందర్శించారు. మొత్తానికి ఈ ఉద్యమం జగన్ సర్కారును కదిలించిందో.. లేకుంటే దీనితో సంబంధం లేకుండానే జరిగిందో కానీ.. సీఎం జగన్ ఈ ఇష్యూపై సమీక్ష ని‌ర్వహించారు. ఇళ్లు లేని వారికి అందరికీ ఇళ్లు ఇవ్వడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్న సీఎం జగన్ ...ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ  5,655 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.


ఇళ్ల నిర్మాణంపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలన్న సీఎం జగన్...లే అవుట్లలో పర్యటన వల్ల ఇళ్ల నిర్మాణ ప్రగతిపై సమీక్షించాలన్నారు. ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని సీఎం జగన్ అన్నారు. లే అవుట్లను సందర్శించినట్టుగా ఫొటోలను కూడా అప్‌లోడ్‌ చేయాలని సీఎం జగన్ తెలిపారు. ప్రతి శనివారం హౌసింగ్‌డేగా నిర్వహిస్తున్నట్టు సీఎం జగన్ తెలిపారు. ఇళ్లు పూర్తయ్యే సరికి మూడు రకాల మౌలిక సదుపాయాలు ఉండాలన్న సీఎం జగన్... విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలన్నారు.


మిగిలిన మౌలిక సదుపాయాలనూ వృద్ధిచేసుకుంటూ ముందుకు సాగాలని సీఎం జగన్ అన్నారు.ఈ పనులకు సంబంధించి ఇప్పటికే డీపీఆర్‌లు సిద్ధం అయ్యాయని సీఎం జగన్ తెలిపారు. ప్రభుత్వమే ఇళ్లు నిర్మించేలా ఆప్షన్‌–3 ని ఎంపిక చేసుకున్న లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణం సత్వరం పూర్తి చేసేలా దృష్టిపెట్టాలని  అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. లే అవుట్ల వారీగా ప్రాధాన్యత పరంగా పనులను గుర్తించి.. అనుకున్న సమయానికి ఆ పని పూర్తయ్యేలా చూడాలని సీఎం జగన్ అన్నారు.


ఇళ్ల నిర్మాణం అనుకున్న సమయానికల్లా పూర్తికావాలని.. ఇళ్ల నిర్మాణం నాణ్యతలో ఎలాంటి రాజీ వద్దని సీఎం జగన్ సూచించారు. ప్రతి దశలోనూ నాణ్యతా నిర్ధారణ పరీక్షలు జరగాలని సీఎం జగన్ అన్నారు. ఇళ్ల నిర్మాణంలో క్వాలిటీని నిరంతరం పాటించడానికి ఎస్‌ఓపీలను అందుబాటులో ఉంచాలన్న  సీఎం జగన్ గ్రామ సచివాలయాల్లో ఉన్న ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ సేవలను విస్తృతంగా వాడుకోవాలన్నారు. ఇళ్ల నిర్మాణంలో క్వాలిటీ ప్రమాణాలు పాటించే విషయంలో ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ భాగస్వామ్యం తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: