వైసీపీ సర్కారు సంక్షేమ ప్రభుత్వంగా పని చేస్తున్న సంగతి తెలిసిందే. అనేక వర్గాలకు అనేక పథకాలు అమలు చేస్తున్నారు. అయితే దీన్ని కూడా విపక్షాలు  విమర్శిస్తున్నాయి. ప్రజలకు జగన్ డబ్బు పంచి ఓట్లేయించుకుంటున్నారని అంటున్నాయి. దీనిపై మంత్రి ధర్మాన ఘాటుగా స్పందించారు. ప్రజలకు మేలు చేయడం కూడా నేరమేనా అని ఆయన మాట్లాడారు. జనం వద్దని చెబితే పథకాలు ఆపేస్తామన్నారు. పుట్టిన బిడ్డ ద‌గ్గ‌ర నుంచి పండు ముస‌లి వ‌ర‌కూ ప్రతి ఒక్కరికి జగన్ ప్రభుత్వం తోడుగా ఉంద‌ని మంత్రి ధ‌ర్మాన ప్రసాద‌రావు అంటున్నారు.


కరోనా సమయంలో 9 నెలలు ఉచితంగా రేషన్ అందించామని మంత్రి ధ‌ర్మాన ప్రసాద‌రావు గుర్తు చేశారు. మన ప్రభుత్వ ఆసుపత్రి విషయంలో గతానికీ, ఇప్పటికీ ఉన్న తేడా గమనించాలని మంత్రి ధ‌ర్మాన ప్రసాద‌రావు కోరారు. మన మార్కెట్, టౌన్ శానిటేషన్.. ఇలా అనేక విషయాల్లో అభివృద్ధి జరిగిందని మంత్రి ధ‌ర్మాన ప్రసాద‌రావు అన్నారు. ఇది పరిపాలనలో భాగమేనని.. ఇన్ని పథకాలు అందుకునే క్రమంలో ఎవ్వరైనా మ‌ధ్యవ‌ర్తులు ఉన్నారా అని మంత్రి ధ‌ర్మాన ప్రసాద‌రావు ప్రశ్నించారు.


ఇక ప్రతిపక్ష నాయ‌కుల‌కు విమర్శలు చేయడానికి విషయం లేక ధరలు పెరుతున్నాయని  గగ్గోలు పెడుతున్నారని మంత్రి ధ‌ర్మాన ప్రసాద‌రావు అన్నారు. ధరల పెరుగుదల దేశం మొత్తం మీద పెరిగాయని... ఒక్క మన రాష్ట్రంలోనే కాదని... చంద్రబాబు ఎన్నికల ముందు పథకాలు ఇస్తే, జగన్ అధికారంలోకి రాగానే తాను ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేసేందుకు కార్యాచ‌ర‌ణ‌ను మొదలు పెట్టారని మంత్రి ధ‌ర్మాన ప్రసాద‌రావు అన్నారు.


పేద‌వారి పిల్లలు నిరక్షరాస్యలుగా ఉండకూడ‌దని చదువుకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామన్న మంత్రి ధ‌ర్మాన ప్రసాద‌రావు.. నాడు - నేడు ద్వారా స్కూల్స్- లో అనేక మార్పులు తీసుకు వస్తున్నామని తెలిపారు. స్థానికుల నుంచి వ‌చ్చిన విన‌తుల మేర‌కు వార్డులో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కమ్యూనిటీ హాల్ మరమ్మతులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి ధ‌ర్మాన ప్రసాద‌రావు హామీ ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: