నెల్లూరు కోర్టులో సాక్ష్యాల చోరీ కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించడం కలకలం రేపుతోంది. జిల్లాలో రాజకీయంగా వేడి నెలకొంది. ఈ ఘటన సినిమా డ్రామాను తలపిస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి ఆరోపించారు. కోర్టులో  చోరీ ఘటనపై జరిగిన విచారణ తీరను జిల్లా జడ్జి యామని అనుమానం వ్యక్తం చేస్తూ తన నివేదికను హైకోర్టుకు  తెలియజేశారని ఆయన నెల్లూరులో తెలిపారు. నలుగురు పోలీసులు కాపలా ఉన్న కోర్టులో ఇనుము కోసం వచ్చిన ఇద్దరు దొంగలు మంత్రి కాకాణి నిందితుడుగా ఉన్న కేసుకు సంబంధించి సాక్ష్యాలను ఎత్తుకుపోవడం విడ్డూరంగా ఉందని టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి అన్నారు.


చోరీ ఘటనపై డాగ్స్ స్వాడ్ ను ఎందుకు తీసుకురాలేదని, ఫింగర్ ప్రింట్స్ ఎందుకు తీయలేదని  పోలీసులు తెలపాలని టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి అన్నారు. పోలీస్ విచారణపై నమ్మకం లేక మరో ఏజెన్సీతో విచారణ జరిపించాలని న్యాయమూర్తి హైకోర్టును కోరారంటే ఇంతకన్నా పోలీసులకు అవమానం ఏమైనా ఉంటుందా అని టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి ప్రశ్నించారు. సిబిఐ విచారణకు అధికారులు సహకరిస్తారన్న నమ్మకం తమకు లేదని టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి అన్నారు.


రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా పోలీసులపై చర్యలు తీసుకొని,  కాకాణిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసి, అరెస్ట్ చేయాలని టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి డిమాండ్ చేశారు. ఎనిమిది అలమరాలు ఉంటే, ఒక్క అలమరాకు తాళం వేయలేదన్న అందులోని సాక్షాలను మాత్రమే దొంగలు చోరీ చేసి కాలువలో పడేయడంలో లోగుట్ట ఏమిటని టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి ప్రశ్నించారు.  పోలీసులు చోరీకి గురైన లాప్టాప్, పాస్పోర్ట్స్, స్టాంప్స్ కాలువలో నుంచి రికవరీ చేస్తే,  లాప్టాప్ లో వివరాలేమి లేవని టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి అన్నారు.


అసలు సాక్షాలు సంబంధించిన ఈ లాప్టాప్, పాస్‌పోర్ట్స్‌ , స్టాంపులు కోర్టులోనే లేవని, పోలీస్ స్టేషన్లో ఉన్నట్లు జడ్జి తన నివేదికలో తెలియజేశారని టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి చెప్పారు. కోర్టులోనే లేని సాక్ష్యాలను దొంగలు ఎలా చోరీ చేశారో అంతు చిక్కడంలేదని టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి అన్నారు. జిల్లా జడ్జి వ్యక్తం చేసిన అనుమానాలకు పోలీసులు సమాధానం చెప్పాలని టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: