ఏపీలో ఫించన్ల తొలగింపు అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారుతోంది. చాలా మంది పింఛన్‌ దారులకు నోటీసులు వస్తున్నాయి. మీరు కరెంట్ బిల్లు ఎక్కువ కడుతున్నారమో.. మీకు ఎక్కువ ఆదాయం ఉందనో.. మీకు ఎక్కువ స్థలాలు ఉన్నాయనో.. మీ కుటుంబ సభ్యులు ఐటీ కడుతున్నారనో ఆ నోటీసులు చెబుతున్నాయి. దీంతో తమ పింఛన్లు ఎక్కడ పోతాయోనని చాలా మంది ఆందోళనలో ఉన్నారు.

అడ్డగోలు నిబంధ‌న‌లు, అబ‌ద్ధపు నోటీసుల‌తో ఇష్టారాజ్యంగా ఏపీలో పింఛ‌న్ల తొల‌గిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. దీంతో విపక్షాలు మండిపడుతున్నాయి.  పింఛ‌ను న‌య‌వంచ‌న త‌గ‌దంటూ ముఖ్యమంత్రికి నారా లోకేష్ లేఖ రాశారు. అధికార పీఠం ఎక్కేందుకు పింఛ‌న్ల పెంపు పేరుతో  ఇచ్చిన హామీలు మ‌రిచిపోయారా అని నారా లోకేష్ లేఖ  ఆక్షేపించారు. గ‌ద్దె ఎక్కిన నుంచీ పింఛ‌న్ల న‌య‌వంచ‌నకి దిగారని నారా లోకేష్ లేఖ  మండిపడ్డారు.  తెలుగుదేశం ప్రభుత్వం 200 రూపాయలుగా ఉన్న ఫించన్  2వేలు  చేసిందని నారా లోకేష్ లేఖ అన్నారు. 3000 పింఛ‌ను చేస్తామ‌ని హామీ ఇచ్చి మోస‌గించారని నారా లోకేష్ లేఖ  ధ్వజమెత్తారు.  


అధికారంలోకి వచ్చిన వెంట‌నే వయోపరిమితి నిబంధ‌న‌ల‌తో సుమారు 18.75 లక్షల పెన్షన్లను రద్దు చేశారని నారా లోకేష్ లేఖ  ఆగ్రహం వ్యక్తంచేశారు.  రాష్ట్ర వ్యాప్తంగా 6 ల‌క్షల మంది పింఛ‌న్లను ర‌ద్దు చేయాల‌నుకోవ‌డం చాలా అన్యాయమని నారా లోకేష్ లేఖ  ఆవేదన వ్యక్తంచేశారు.  20 ఏళ్ల నుండీ పెన్షన్లు పొందుతున్న అవ్వాతాత‌లు, దివ్యాంగులు, వితంతువులు త‌మ ఆస‌రా తొల‌గించి ఉసురు తీయొద్దని వేడుకోవ‌డం ప్రభుత్వానికి వినిపించ‌డంలేదా  నారా లోకేష్ లేఖ  అని మండిపడ్డారు.


నిరుపేద‌ల‌కు లేని కారు, పొలం,  ఇల్లు, ఆస్తులు ఎలా సృష్టిస్తున్నారో అర్థంకావ‌డంలేదన్నారు.  ముఖ్యమంత్రి  మాన‌వ‌త్వంతో ఆలోచించాలని నారా లోకేష్ లేఖ  హితవుపలికారు.  అవ్వాతాత‌ల జీవితాల‌కు వెలుగునిచ్చే చిరుదీపాన్ని ఆర్పే ప్రయ‌త్నం చేయొద్దని నారా లోకేష్ లేఖ  కోరారు. దివ్యాంగుల‌కు ఆస‌రాగా నిలిచిన పింఛ‌నుని లాక్కోవ‌ద్దని నారా లోకేష్ లేఖ అన్నారు.  వితంతువుల జీవ‌నానికి చేదోడు అయిన పెన్షన్ కోతతో వారికి గుండెకోత మిగ‌ల్చవ‌ద్దని నారా లోకేష్ లేఖ  తేల్చి చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: