గతంలో మోడీని తల్లిని వదిలేసిన వాడు, భార్యను వదిలేసిన వాడు అని నోటికి వచ్చినట్టు తిట్టిన చంద్రబాబునాయుడు ఇప్పుడు మోడీ తన సమకాలికుడు అని మాట్లాడటం ఒక విచిత్రం అయితే, మరొకవైపు మోడీని పొగుడుతూ మాట్లాడుతున్నారు. మోడీ గారి లాంటి గొప్ప నాయకుడిని ఇచ్చిన తల్లి గారికి ఇటీవలే నివాళులర్పించడం మరో విచిత్రం. భార్యను చూసుకోలేని వాడు దేశాన్ని ఏం చూసుకుంటాడు అని.. సిగ్గూ గౌరవం లేని వాడు మోడీ అని.. మోడీ కన్నా ఒక సాధారణ కార్యకర్త చాలా బెటర్ అని గతంలో కామెంట్ చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు స్వరం మార్చేశారు.


దేశానికి గొప్ప నాయకుడిని ఇచ్చిన మాతృమూర్తి చనిపోతే దేశ ప్రధాని కూడా సామాన్య ప్రజలలా.. చాలా సామాన్యంగా అంత్యక్రియలు నిర్వహించడం గొప్ప విశేషమని పొగిడారు. ప్రధానమంత్రి మోడీ గారికి  తన సంతాపం తెలియజేస్తున్నానని చంద్రబాబు నాయుడు పేర్కొనడం ఒక విచిత్రంగా చెప్పుకోవచ్చు. అంటే చంద్రబాబుగారిలో మార్పు వచ్చింది, కానీ తెలుగుదేశం పార్టీలోని కార్యకర్తల కన్నా ఒక ప్రత్యేకమైన సెక్షన్ కు సంబంధించిన వ్యక్తులు అంటే చంద్రబాబు నాయుడు కి సంబందించిన పార్టీ కన్నా చంద్రబాబునాయుడు కుటుంబం కన్నా చంద్రబాబునాయుడుని అభిమానించే  వ్యక్తులకు మాత్రం చంద్రబాబునాయుడులో వచ్చిన మార్పు నచ్చడం లేదని అర్థమవుతుంది.


దానికి ఉదాహరణగా ఇటీవల ప్రధానమంత్రి గారి  మాతృమూర్తి గారి మరణం, మాతృమూర్తి గారి అంత్యక్రియల్లో పార్థివ దేహాన్ని మోస్తున్న విషయంలో అది మోస్తున్నట్టు ఉందా.. నటిస్తున్నట్టుగా లేదా అనేటువంటి వ్యాఖ్యలు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. బాబు బిజెపితో కలవాలనుకుంటే అది తన సొంత విషయంలోకి లెక్కలోకి రాదు..  తన ఒప్పుకోలుతో పాటు , ముందు తన పార్టీ క్యాడర్లోని నాయకులను కూడా ఒప్పించాలి.. కానీ అది జరుగుతుందో లేదో తెలియదు. మరోవైపు మోదీ సైతం బాబు పాత డైలాగులు అంత సులభంగా మర్చిపోతారా?


మరింత సమాచారం తెలుసుకోండి: