బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకంతో సంక్రాంతి పండుగ పూట మూడు కోట్ల మంది పస్తులుండబోతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. కేంద్రం ఉచితంగా ఐదు కిలోల రేషన్ బియ్యం అందిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇంతవరకు ఎందుకు పంపిణీ చేయడంలేదని బండి సంజయ్‌ ధ్వజమెత్తారు. సీఎం నిర్లక్ష్యం బాధ్యతారాహిత్యం కారణంగా పేదలు పండుగ పూట పస్తులుండే దిస్థితి ఏర్పడడం క్షమించరాని నేరంగా బండి సంజయ్‌ పేర్కొన్నారు. పేదలకు బియ్యాన్ని పంపిణి చేస్తే కేంద్రానికి పేరొస్తుందనే అక్కసుతో పేదల కడుపు కొట్టడం ఎంతవరకు న్యాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రశ్నించారు.


ఇప్పటికైనా కేంద్రం ఉచితంగా అందిస్తున్న బియ్యాన్ని రేషన్ కార్డుదారులందరికీ ఉచితంగా పంపిణీ చేయాలని బండి సంజయ్‌ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత కారణంగా ఉద్యోగుల కుటుంబాలు పండుగ కూడా జరుపుకోలేని దుస్థితి నెలకొందని బండి సంజయ్‌ మండిపడ్డారు. ఈ నెలా10 తేదీ వచ్చినా పలు జిల్లాల్లో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జీతాలతోపాటు పెన్షనర్ల ఖాతాల్లో పెన్షన్ సొమ్ము పడకపోవడం బాధాకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు.


సంక్రాంతి పండుగకు పెండింగ్ లో 4 డీఏలు చెల్లిస్తారని ఆశిస్తే... కనీసం జీతాలు కూడా ఇవ్వకపోవడం దురదృష్టష్టకరమని బండి సంజయ్‌ దుయ్యబట్టారు. ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు తీసుకోవడమనేది ఉద్యోగుల హక్కును కాలరాయడమంటే రాజ్యాంగ మౌలిక సూత్రాలను ఉల్లంఘించడమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పేర్కొన్నారు. ఉద్యోగుల హక్కులను కాలరాసే అధికారం మీకెవరిచ్చారని సీఎం కేసీఆర్‌నుద్దేశించి బండి సంజయ్‌ ప్రశ్నించారు. వెంటనే ప్రభుత్వ, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ  తక్షణమే జీతాలతోపాటు పెన్షనర్లకు పెన్షన్  సొమ్మును విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

kcr