బీటెక్ చదివి బడా టెక్ కంపెనీలలో ఉద్యోగులుగా ఒక వెలుగు  వెలుగుదామని , అమెరికా లాంటి బడాదేశాలు టెక్ ఉద్యోగులకు  ఉద్యోగాల కొలువుని ఏర్పాటు చేసి వారి కలలని నెరవేరతాయని ఇకపై  వారు అనుకుంటే అది చాలా పొరపాటే అవుతుంది. ఎందుకంటే వాళ్లకు గతంలో ఉన్న డిమాండ్ ఇప్పుడు ఏ దేశాల వారు.. ముఖ్యంగా అమెరికా లాంటి అగ్ర దేశాలు ఇవ్వడం లేదు. ప్రపంచం ఈ ఏడాదిలో మూడోవంతు  ఆర్థిక  మాంద్యం లోకి జారుకోవచ్చని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఐఎంఎఫ్ ఈ మధ్యనే హెచ్చరించింది. ఈ భయంతో అనేక టెక్ కంపెనీలు గత ఏడాది చివరి త్రైమాసికం అక్టోబర్-డిసెంబర్ నుంచి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి.


వ్యయాలను తగ్గించుకునేందుకు భారీ సంఖ్యలో  ఉద్యోగుల కోతను విధిస్తున్నాయి.  ఈ సంవత్సరం టెక్ రంగానికి మరింత గడ్డుకాలంలా మారబోతుందని, ఈ సమస్య మరో రెండు సంవత్సరాలు ఇదేవిధంగా ఉంటుందని తెలుస్తుంది. దీంతో హెచ్ వన్ బీ వీసా తో అమెరికా వెళ్లిన టెకీల పరిస్థితి అయోమయంగా మారింది. అంతేకాకుండా అమెరికా  హెచ్ వన్ బి వీసా ఫీజు కూడా 70% పెంచి 780డాలర్లు గా మార్చాలని ప్రతిపాదించడంతో వాళ్ల పరిస్థితి మరింత దారుణంగా తయారయింది.


ఇక పై హెచ్ వన్ బి వీసా దరఖాస్తుదారులు, వీసా కావాలంటే 215 డాలర్లు ప్రీ రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాలట. ఇక్కడ ఆ ఉద్యోగులకు మరో సమస్య ఏంటంటే బడా టెక్ కంపెనీలు, కొత్త ఉద్యోగులను తీసుకోకపోవడం వల్ల, పాత జాబ్ లు పోయిన వాళ్లకి కొత్త జాబ్ లు దొరకడం కూడా కష్టమైపోతుంది. అమెజాన్, గూగుల్, సేల్స్ ఫోర్స్, ఉబర్ లాంటి అమెరికా కంపెనీలు కొత్త సిబ్బందిని తీసివేయడమే కాకుండా హైరింగ్ ను కూడా తాత్కాలికంగా ఆపివేశాయి. ఉద్యోగం పోయిన 60 రోజుల్లో మరో కొత్త జాబ్ ను వెతుక్కోలేకపోతే అమెరికాను వీడి వెళ్లిపోవాలన్నది  వాళ్ళకి సమస్యగా మారిపోతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: