ఉచితాలు, సబ్సిడీలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం భాజపాకు అస్సలు ఇష్టం ఉండదు. అందుకే చాలా ఏళ్లుగా అది అధికారంలో లేదు. ఇప్పుడు వచ్చినా అది అంతగా ఉచితాలను ఇవ్వడానికి ఇష్టపడదు. అయినా గతేడాదిగా ప్రజలకు రేషన్ బియ్యం ఉచితంగా ఇస్తుంది. ఉచితం అనేది కాకుండా డబ్బులను వ్యక్తి ఖర్చు పెడుతూ దాంతో సంపాదించాలి. అలాగే కేంద్రం రైతులకు ఏడాదికి కిసాన్ సమ్మాన్ నిధి కింద మూడు విడతలుగా ఏడాదికి ఆరు వేలు చెల్లిస్తోంది. నాలుగు నెలలకోసారి రూ. 2 వేల చొప్పున చెల్లిస్తోంది. ప్రస్తుతం దాన్ని ఎనిమిది వేలకు పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.


అంటే ప్రజా సంక్షేమమే కానీ ఉచితాలను వద్దనే భాజపా సైతం మరో రెండు వేల రూపాయాలు పెంచాలని భావిస్తోంది. పార్టీలో మార్పు వచ్చిందా. అందులో ఉన్న నాయకుల్లో మార్పు వచ్చిందా. అని ప్రజలు, ఆయా ప్రతిపక్షాల నాయకులు ఆలోచిస్తున్నారు. ఈ మధ్య కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల్ సీతారామన్ మాట్లాడుతూ.. మధ్య తరగతి వాళ్లంటే తనకిష్టమని చెప్పుకొచ్చింది. అలాగే ఇన్ కం ట్యాాక్స్ కట్టే చిన్న పాటి ఉద్యోగులకు స్లాబ్ లో మార్పులు చేస్తూ కొంతవరకు మంచి చేశారు. భాజపా ఆలోచన ధోరణి ఏ విధంగా పయనిస్తుందో ఎవరికి అంతుబట్టని విధంగా మారింది.


గతంలో గుజరాత్ మోడల్ తరహా పాలన అంటూ కేంద్రంలో పాగా వేసిన భాజపా ప్రభుత్వం అలాంటి విధానాలను దేశ వ్యాప్తంగా అమలు పరచడంలో కొంత వరకు సక్సెస్ అయింది. అదెలా అంటే ప్రతి ఒక్కరూ ఆర్థికపరమైన అంశాల్ని డిజిటలైజేషన్ చేయడం, స్మార్ట్ ఫోన్లలోనే స్కానింగ్, యూపీఐ కోడ్ ద్వారా డబ్బులు పంపించడం లాంటి అంశాలతో పూర్తిగా దేశ ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులకు శ్రీకారం చుట్టారు. ఉచితాలు కాకుండా దాన్ని సంక్షేమానికి ఉపయోగపడేలా చేయడం కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని చెప్పకనే చెబుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: