ఒకప్పుడు జనాభా పెరుగుదలకు సంబంధించి ఆయా దేశాలు ఆయా రాష్ట్రాలు ఆందోళన పడేవి. ముఖ్యంగా చైనా లాంటి దేశాలు అయితే ఒకరు ముద్దు ఇద్దరు వద్దని సందేశాలు ఇచ్చాయి. దీంతో జనాభాలో అంతరాలు పెరిగాయి. యువత తగ్గిపోయి వృద్ధులు పెరిగిపోయారు. ఆ దేశంలో ఇబ్బందులు పెరుగుతున్నాయి.గతంలో ఒక పాఠశాలకు వెళ్లి రావాలంటే మూడు నాలుగు కిలోమీటర్లు ఒక కళాశాలకు వెళ్లాలంటే 10 కిలోమీటర్లు ఎంతో కష్టపడి వెళ్లి చదువుకునేవాళ్ళు. ఆ చదువును ఆస్వాదించే వాళ్ళు. కానీ ప్రస్తుతం విలాసవంతమైన జీవితానికి అందరూ అలవాటు పడిపోయారు.


అమ్మ ఒడి విద్యా జీవన లాంటి పథకాలతో విద్యార్థులని పాఠశాలకు రప్పించి వారికి చదువు ప్రభుత్వమే చెప్పిస్తుంది.  ఒకప్పుడు చదువుకోవాలంటే ఎంతో దూరం వెళ్లి చదవాల్సిన పరిస్థితి నుంచి ప్రస్తుతం అన్ని ఉచితంగా వస్తూ చదువుకోవాలని చెబుతున్న దూరంగా ఉండాలని కోరుకుంటున్నారు సిక్కిం లో ఒక రకమైన పరిస్థితి, ప్రభుత్వ ఉద్యోగులు ఒకరి కంటే ఎక్కువగా బిడ్డల్ని కనాలని అలా కన్నవారికి ప్రసూతి సెలవులు 365 రోజులని పితృత సెలవులు నెలరోజులు ఇస్తామని ప్రకటించింది. అలాగే జనాభా పెరుగుదలకు కొన్ని రకమైన చర్యలు చేయబడుతుంది.


అక్కడ జనాభాలో అంతరాయం దీనికి కారణమని తెలుస్తుంది. జనన మరణాన్ని రేట్లలో వృద్ధిలో అంతరాయం ఉంది. కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అంటే ఒకప్పుడు ఎక్కువమంది కంటున్నారు అని చెప్పి ఇబ్బందులు పడిన రోజుల నుండి ప్రస్తుతం సంసారం చేసి పిల్లల్ని కంటే ప్రభుత్వమే తాయిళాలు ఇచ్చే పరిస్థితికి వచ్చామన్నమాట.  అంటే ఇలాంటి పరిస్థితి ఎక్కడికి దారితీస్తుందో దీనికి ప్రధాన కారణం ప్రతి ఒక్కరూ కష్టపడకుండానే డబ్బులు రావడం ఉచితాలు అందివ్వడం విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడడం. దీనివల్ల శ్రమ తగ్గిపోయి కష్టమనే విలువ తెలియకుండా జీవితాలు గడుపుతున్నారు. కనీసం పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలన్న వారిని పోషించాలన్న భయపడే పరిస్థితికి చేరిపోయారు. మరి ఎంత వరకు ఇలాంటి పరిస్థితులు ఉంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: