పవన్ కళ్యాణ్  సీఎం అవ్వాలని వాళ్ళ పార్టీలోనే, అంటే జనసేన పార్టీలోనే కొంత మంది అనుకోవడం లేదని తెలుస్తుంది. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని పెట్టినప్పుడు కూడా ఆ పార్టీలోని స్వార్థపరమైన కొంతమంది నాయకులు చిరంజీవితోనే ఉంటూ చివరికి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో  విలీనం చేసేలా చేశారు. గతంలో బిజెపితో జనసేన పొత్తు పెట్టుకోవాలనుకున్న సందర్భంలో.. జనసేన లోని ఒక వర్గం, బిజెపితో జనసేన కలవడం ఇష్టం లేక, వారిద్దరిని వేరు చేయడానికి ప్రయత్నించి సఫలం అయ్యారు. దానికి కారణం బిజెపితో కలిస్తే నెగ్గలేమనో  లేక తెలుగుదేశం వైపు జనసేనను నడిపిద్దామనో, ఇలా ఏదో ఒక కారణంతో వారైతే జనసేనను బిజెపికి దూరం చేయడం జరిగింది.


అలా వారు బిజెపితో జనసేన పార్టీని కలవకుండా చేస్తూ, తెలుగుదేశానికి కలపడానికి జరిగిన ప్రయత్నంలో వారైతే  చాలావరకు విజయం సాధించారనే  చెప్పుకోవచ్చు. అసలు జనసేన లోని ఆ వర్గం తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవాలనుకోవడానికి అసలు కారణం  తాము ఒంటరిగా పోటీ చేస్తే నెగ్గలేమేమో అనే భయం కావచ్చు. గతంలో ఎన్నికల్లో పోటీ చేసినవాళ్లు, చేసి ఓడిపోయిన వాళ్లు జనసేన పార్టీ తెలుగుదేశంతో పొత్తు కలుపుకుంటే రాజకీయంగా వారి భవిష్యత్తు బాగుంటుందని ఆ వైపుగా జనసేనానిని అడుగులు వేయించినట్టు తెలుస్తుంది. అలా వారు లోకల్ గా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని స్థానిక ఎన్నికల్లో తమ వాళ్లను కొంతమందిని గెలిపించుకున్నారు.


భవిష్యత్తులో కూడా వారు ఎమ్మెల్యేలుగా గెలవాలంటే పవన్ కళ్యాణ్ ని కూడా తెలుగుదేశం వైపు వెళ్లేలా చేయాలని ప్రయత్నించి ఆ రకంగా జనసేన పార్టీని తెలుగుదేశంతో సన్నిహితంగా ఉండేలా చేశారు. రాబోయే 2024 ఎలక్షన్స్ లో ఎలక్షన్ల ఫలితాలను శాసించేది జనసేన పార్టీ అనడంలో సందేహం లేదు. కానీ ఇక్కడ అసలు జనసేన పార్టీకి సంబంధించిన ఆ సెకండ్ గ్రేడ్ నాయకులు, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయినా కాకపోయినా, తాము మాత్రం ఎమ్మెల్యేలుగా  గెలవాలనుకుంటున్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: