ప్రపంచ ప్రజాస్వామ్య దేశాల్లో అమెరికా అత్యంత పురాతనమైన దేశం అని చెప్పవచ్చు. అక్కడ ఉండే దర్యాప్తు సంస్థలు ప్రపంచంలో ఎక్కడా లేవు.  ఎలాంటి కేసునైనా ఛేదించగల శక్తి సామర్థ్యం ఉన్న దేశం. కానీ మరోసారి కాల్పుల మోతతో లాస్ ఏంజిల్స్ నగరం రక్త సిక్తమైంది. అమాయకులైన వారి ప్రాణాలు పోయాయి. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ నగరంలో ఎక్కువగా చైనీయులు నివాసం ఉండే ప్రదేశం లో ఈ ఘటన చోటుచేసుకుంది. అమెరికా లో తుపాకీ సంస్కృతి పోతేనే ఇలాంటి మరణాలు తగ్గుతాయి. లాస్ ఏంజెల్స్ లోని మంటేరి పార్క్,గార్బేరి డాన్స్ క్లబ్ లో చైనీయులు లూనార్ న్యూ ఇయర్ వేడుకల్లో  పాల్గొంటున్నారు.


ఆ డ్యాన్స్ ప్రోగ్రాం లో దుండగుడు విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో పదిమంది ప్రాణాలు  పోయాయి. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు ఇంకా దుండగుడిని పట్టుకున్నట్టు సమాచారం లేదు. దానికి సమీపంలోనే మరో ప్రాంతంలో కూడా  కాల్పులు  చోటు చేసుకున్నాయి. ఈ కాల్పులు  జరిగిన ప్రాంతంలో ఆసియా ఖండానికి చెందిన వారు ఎక్కువగా నివసిస్తుంటారు. ముఖ్యంగా చైనీయులు భాష మాట్లాడే వారు ఎక్కువగా ఉంటారు. వీరిని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారా.. లేక ఉన్మాదంతో జరపడా అన్నది పట్టుపడితే గాని తెలియని పరిస్థితి.


అమెరికా ఎంతో పేరుగాంచిన దేశమైనప్పటికీ తుపాకీ సంస్కృతి వల్ల ఎంతో మంది ప్రాణాలు బలైపోతున్నాయి. దీనివల్ల ఆ దేశంలో ఎక్కడో ఒక చోట అలజడి రేగుతూనే ఉంటుంది. ఇంత అభివృద్ధి చెందిన దేశంలో ఇలా ప్రతిసారి కాల్పులు మోతల్లో అమాయకుల ప్రాణాలు బలవుతున్నాయి. ఇలాంటి ఘటనలు జరిగిన ప్రతిసారి అమెరికా అంటేనే సామాన్య జనాల్లో వణుకు పుడుతుంది. ఇంకెప్పటికి కాల్పులు జరగకుండా అపలేరా.. ఇలాంటి ఉన్మాద చర్యలకు అడ్డుకట్ట వేయలేని దేశంగా అమెరికా ప్రతిష్ట మసకబారుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

us