రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కాశ్మీర్ కు చేరుకుంది. దీనికోసం చాలా రోజులుగా రాహుల్ పాదయాత్ర చేపట్టాడు. అసలు విషయంలోకి వస్తే కాశ్మీర్ లో లాల్ చౌక్ లో భారత జెండా ఎగరవేయడం. లాల్‌చౌక్‌ లో జెండా ఎగరవేస్తానని అనుమతి కోరాడు. అనంతరం లాల్చౌక్లో భారత్ జెండా ఎగరవేయడం ఆర్ఎస్ఎస్ వాళ్ల పని మా పని కాదని వెనక్కి వచ్చేసాడు. ఈయన అంతరంగం ఏంటో దేశ ప్రజలకు అస్సలు అర్థం కావడం లేదు. అక్కడ భారత జెండా ఎగరవేస్తే అక్కడున్న మైనార్టీల ఓట్లు పడవనా లేక అది భారత దేశంలో లేదని ఈయన ఉద్దేశమా... ఇలాంటి వ్యక్తి ప్రధాని ఎలా అవుతాడన్న విమర్శలు వస్తున్నాయి.


గతంలో లాల్‌చౌక్ లో జెండా ఎగరవేసేందుకు మురళీ మనోహర్ జోషి ఆధ్వర్యంలో భాజపా నాయకులు వెళ్లారు. అంతకుముందు లష్కర్ ఏ తోయిబా,  జైషే మహమ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థలు కాశ్మీర్లోని లాల్ చౌక్ లో దమ్ముంటే భారత జెండా ఎగరేయాలి అని భారత ప్రభుత్వానికి సవాల్ విసిరారు. కానీ అప్పుడు ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్, ప్రధానమంత్రిగా పీవీ నరసింహారావు ఉన్నారు. ఆ ప్రాంతంలో జాతీయపరంగా జెండా ఎగరవేయాల్సిన కాంగ్రెస్ వెనకడుగు వేసింది. కానీ ఇందులో ముందు వరుసగా వెళ్ళింది ముఖ్యంగా బాజపా.. మురళీ మనోహర్ జోషి ఆధ్వర్యంలో వెళ్లి అక్కడ జెండా ఎగరవేశారు. అందులో ఉన్న ఒక నాయకుడే ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ నుంచి కిషన్ రెడ్డి కూడా ఉన్నారు.


ప్రస్తుతం రాహుల్ లాల్‌చౌక్‌ లో భారత జెండా ఎగురవేయను అని అనడంతో అది కాస్త వివాదంగా మారింది. లాల్‌చౌక్‌ లో జెండా ఎగరవేయడం ఆర్ఎస్ఎస్ పని అనడం ఎంతవరకు సబబు. కాంగ్రెస్ ఇలా అయితే దేశంలో ఎలా గెలవగలరు. ఒకప్పుడు కాశ్మీర్ పండితులను అక్కడి నుంచి ఉగ్రవాదులు ఊచకోత కోసి గెంటేశారు. దాని గురించి మాట్లాడరు కానీ ఇక్కడ జెండా ఎగరవేస్తే ఆర్ఎస్ఎస్ వాళ్లు ఎగరేసినట్లని అనడంలో రాహుల్ గాంధీకి మతి భ్రమించిందని అనుకోని వారు ఉండరని విమర్శకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: