రష్యా విదేశాంగ మంత్రి మాట్లాడుతూ.. యూరప్ మొత్తం ఒక వైపు, రష్యా మరో వైపు నిలుస్తోందని అన్నారు. ఇలా ఆయా దేశాలు ఉక్రెయిన్ కు ఆయుధాలు సరఫరా చేస్తూ హైబ్రిడ్ యుద్ధం చేయడం కన్నా ఒకేసారి వస్తే ఏదో ఒకటి తేలిపోతుందన్నారు. హైబ్రిడ్ యుద్ధం వల్ల వారు సాధించేది ఏదీ లేదన్నారు. రష్యా మరో అడుగు ముందుకేసి ఆల్ అవుట్ ఆపరేషన్ అనే పదాన్ని బయటకు తీసుకువచ్చింది. దీంతో ఉక్రెయిన్ లో ఇప్పటి వరకు గెలుచుకున్న ప్రాంతాల్లో కూడా ఉక్రెయిన్ సైనికులు ఉంటున్నారు. ఇలా కాకుండా ఉక్రెయిన్ ను పూర్తిగా స్వాధీనం చేసుకోవడం దీనికి ఎంతవరకైనా తెగించేందుకు సిద్ధమని ప్రకటించింది.


దీనితో పాటు ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న ప్రాంతాల్లో ఉక్రెయిన్ సైనికులు, కానీ ఉక్రెయిన్ భాష మాట్లాడే వారు కానీ ఉండకూడదని నిర్ణయించుకున్నామని ప్రకటించింది. దీంతో 27 దేశాల యూరప్ ఒకవైపు రష్యా మరో వైపుగా నిలబడుతున్నాయి. ఇప్పటికే తమ అధీనంలోకి వచ్చిన జెపో జెజరియా, డొనెట్స్క, కేర్కస్, లాంటి ప్రాంతాల్లో ఆల్ అవుట్ విధాన్ని అమలు చేయాలని అనుకుంటున్నాయి. దీని వల్ల పూర్తి స్థాయి రష్యాన్ భాష మాట్లాడే వారు తప్ప మిగతా వారు ఆయా ప్రాంతాల్లో ఉండటానికి వీలు లేదని తేల్చి చెప్పింది.


దీనికి సంబంధించి ఎంతదూరమైనా వెళతాం. ఎవరితో నైనా యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటించింది. ఇప్పటి వరకు సాగిన హైబ్రిడ్ యుద్ధం వల్ల కొంత నష్టం రష్యాకు జరిగినా ఇకపై తాము తగ్గేది లేదంటున్నారు. ఆల్ అవుట్ విధానాన్ని ప్రకటించాక ఉక్రెయిన్ అధ్యక్షుడు ఎలాంటి ముందడుగు వేస్తాడు. ఉక్రెయిన్ కు సాయం చేయడానికి ఎవరు ముందుకు రానున్నారు. ఒక వేళ మళ్లీ భీకరమైన యుద్ధం వస్తే అది అణు యుద్ధానికి దారి తీసే అవకాశం ఉందా? ఎలాంటి పరిణామాలు జరగనున్నాయి. దీన్ని ఆపేందుకు ఎవరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: