నంద్యాల నియోజకవర్గం నుంచి 2014 సంవత్సరంలో భూమ అఖిలప్రియ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం టిడిపిలో  మంత్రిగా ప్రమోషన్ పొందారు. తదనంతరం జరిగిన 2019 ఎన్నికలలో అఖిలప్రియ ఓడిపోయారు. అంత వరకు బాగానే ఉన్నా ప్రస్తుతం అఖిలప్రియ చేసిన కామెంట్లతో ఒక్కసారిగా రాజకీయ వేడి రగులుకుంది. శిల్పా రవి వైసిపి తరఫున గెలిచినప్పటికీ టిడిపి వాళ్ళతో టచ్ లో ఉంటున్నారని అఖిల ప్రియ ఆరోపించారు. ఆయన  టిడిపి తో టచ్ లో ఉన్నారో లేదో తెలియదు కానీ  వైసీపీ ప్రభుత్వానికి జగన్ కు ఒక హింట్ ఇచ్చినట్టు అయింది.


దీంతో ఇప్పటికే టిడిపిలో టచ్ లో ఉన్న వారిపై జగన్ ఫోన్ టాపింగ్ చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో భూమా అఖిలప్రియ చేసిన ఆరోపణలపై వైసీపీ నిజంగానే స్పందిస్తుందో లేదో చూడాలి. కానీ అంతకు ముందు ఈ ఆరోపణలు చేయడం వల్ల ఆయన ఒకవేళ టీడీపీలోకి వెళ్తే వైసీపీలోకి అఖిలప్రియ వెళ్ళేందుకు రూటు క్లియర్ అవుతుందని అనుకోవచ్చు. అఖిలప్రియ మైండ్ గేమ్ స్టార్ట్ చేసిందని అందరూ అనుకుంటున్నారు.


వచ్చే ఏడాది ఎన్నికలు ఉంటాయి. కాబట్టి ఇప్పటినుంచి గెలుపు బాట పట్టాలని ఆమె ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు ఈ కామెంట్ల ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా మొన్నటి వరకు హైదరాబాదులో బిజినెస్ చేసుకున్న అఖిలప్రియ ప్రస్తుతం మళ్లీ రాజకీయాల్లో చురుకుగా ఉంటుంది.  ముఖ్యంగా నంద్యాలలో శిల్పా రవితో నువ్వా నేనా అన్నట్టు పోటీ కొనసాగేలా ఉంది.


ఒక మంత్రిగా చేసినటువంటి వ్యక్తి నంద్యాల నియోజక వర్గంలో ఓడిపోవడం అనేది కాస్త ఇబ్బంది కలిగించే విషయం. దాని నుంచి బయటకు రావడానికి ప్రస్తుతం ప్రయత్నిస్తోంది. ఒకవేళ వైసీపీ టిడిపి వీరిద్దరి మధ్య జరుగుతున్నటువంటి మాటల దాడిని నిశితంగా గమనిస్తూనే ఎవరికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదనేది అవి తేల్చుతాయి. అప్పటివరకు వీరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: