2019 సంవత్సరంలో 0.8 శాతం ఓట్లు మాత్రమే బీజేపీకి పడ్డాయి. మిగతా అన్ని రాజకీయ పార్టీలు పొత్తులకు పరిమితమై ఓటింగ్ శాతాన్ని పెంచుకున్నాయి. కానీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఒంటరిగానే పోటీ చేసి కొంతవరకు ఓటింగ్ శాతాన్ని పక్క పార్టీలకు వెళ్లకుండా చూసుకున్నాడు. ఉప ఎన్నికలు జరిగిన ప్రాంతాల్లో 14, నుంచి 15 శాతం, స్థానిక సంస్థల ఎన్నికల్లో 7, నుంచి 8 శాతం, మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3.8 శాతం ఓట్లు కమలనాథులు సాధించారు.


అంటే 0.8 శాతం ఓట్ల నుంచి 3.8 శాతానికి ఎగబాకింది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన పక్కకెళ్లిపోయిన కూడా బీజేపీ ఎవరికి భయపడకుండా ఒంటరిగానే పోటీలో నిలబడింది. ఇంకా ముందుకెళ్లాలి. తెలంగాణ తరహాలో పరుగెత్తాలి. కానీ ఓ వైపు జనసేన, మరో వైపు టీడీపీ చట్రంలో ఇరుక్కుపోయింది కమలం పార్టీ. గతంలో టీడీపీలో ఉన్నటువంటి సుజనా చౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్, ప్రస్తుతం తెలుగుదేశంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న దగ్గుబాటి పురందేశ్వరి బీజేపీ పార్టీని  ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.


ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును  ఎలాంటి  స్వేచ్ఛ నిర్ణయం వీళ్లు  తీసుకోనీయడం లేదనే మాటలు వినిపిస్తున్నాయి. బీజేపీని ఆంధ్రప్రదేశ్ లో ముందుకు దూసుకుపోనీకుండా చట్రంలోనే నిలిపి వేస్తున్నారు. వారు దూకుడుగా వ్యవహరించరు. పార్టీ ని చురుగ్గా తెలంగాణ తరహలో తీసుకెళ్లాలంటే సోము వీర్రాజుకు కావాల్సినంత స్వేచ్ఛ లభించడం లేదు. పార్టీలోనే ఉన్నా పెద్ద నాయకులు జనసేన, టీడీపీ పార్టీలో నుంచి వచ్చిన వారు అడ్డుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీజేపీ కూడా తెలంగాణ తరహ దూకుడు ప్రదర్శిస్తేనే ఆంధ్రలో దాని పరిస్థితి మెరుగుపడుతుంది.


ప్రజల్లోకి, యువతకు తొందరగా కనెక్ట్ అవ్వొచ్చు. అప్పుడు పార్టీ మరింత ప్రజల్లోకి వెళ్లగలుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో వచ్చే సాధారణ ఎన్నికల నాటికి పొత్తుల అంశం విషయంలో కాకుండా సొంతంగా పార్టీ నిలుచుంటే ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంటుందనే విషయాలను గమనిస్తేనే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

BJP