కొత్త ప్రభుత్వం పరిపాలన మొదలు పెట్టినప్పటి నుంచి రెండేళ్ల కాలం హనీమూన్ పిరియడ్ అంటారు. ఈ రెండేళ్లూ వాళ్ళు తప్పులు చేసినా, ఏం చేసినా సర్దుకుంటారు. ఎందుకంటే కొత్త కదా అనుభవం లేదు అని సర్దుకు పోతారు. ఆ తర్వాత కూడా బెదురుచూపులు, ఎదురుచూపులతో పరిపాలనను కొనసాగిస్తే కంట్రోల్ చేయలేక పోతే కనుక అప్పుడు పాలనా అసమర్థత అంటారు. ప్రస్తుతం వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూస్తే సగం సమర్ధత, సగం అసమర్థత ఉన్నాయని కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


వారి లెక్కల ప్రకారం సగం సమర్థత ఏంటంటే సచివాలయాల వ్యవస్థ పెట్టడం, స్కూల్ లను బాగు చేయించడం, నవరత్నాలు ఇవ్వడం ఇలాంటివి. సగం అసమర్థత ఏంటంటే సరైన రోడ్లు వేయలేకపోవడం, ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించలేకపోవడం, అట్లానే అవుట్ సోర్సింగ్ వాళ్ళకి కూడా సకాలంలో జీతాలు చెల్లించలేకపోవడం. ఈ విషయంలో పరిపాలన అనుభవానికి సంబంధించిన లోపం కనిపిస్తుందని వాళ్ళు భావిస్తున్నారు.


జగన్ పరిపాలన ప్రారంభించి నాలుగేళ్లు అవలేదు కానీ, అధికారంలోకి వచ్చి మాత్రం, 151 సీట్లతో అధికారంలోకి వచ్చి మాత్రం నాలుగేళ్లు అయింది. 100, 120 వస్తాయనుకున్నారు గాని 151 వస్తాయని ఎవరు ఊహించలేదు, ఒక్క జగన్ తప్ప. అయితే ఇప్పుడు పార్టీ పరిస్థితి మారిందని గతంలో ఉన్న పరిస్థితి అయితే, గతంలో నాలుగేళ్ల క్రితం ఉన్నటువంటి పరిస్థితి అయితే వచ్చే ఎలక్షన్లో ఉండే పరిస్థితి అనేది చెప్పలేమని వాళ్లు అంటున్నారు.


అంటే ఆ రేంజ్ లో రాకపోవచ్చు అని వాళ్ళ ఉద్దేశం కావచ్చు. అయితే అదే పార్టీ తరపున గెలిచి అధికార పార్టీ నుండి అవతలికి వెళ్లడం ఆషామాషీ కాదు. ఒక్క రఘురామ కృష్ణంరాజు నుండి నలుగురు ఎమ్మెల్యేలు బయటకెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు. ఆనాడు సంపూర్ణం అనే స్థితి నుండి ఇప్పుడు అసంపూర్ణమనే స్థితి అయిందని, ఇప్పుడే ఎలా ఉంటే రేపు ఎలక్షన్స్ లోగా ఇంకెలా ఉంటుందో చూడాలని వాళ్ళు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: