
నరేంద్ర మోదీ వ్యవహార శైలి, ఆలోచన విధానం ఒక ప్రణాళిక ప్రకారం ఉంటాయి. టైమ్స్ నౌ చేసిన సర్వేలో మోదీని భారత ప్రధానిగా చూడాలని 64 శాతం మంది కోరుకున్నారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని కేవలం 13 శాతం మంది మాత్రమే అనుకుంటున్నారు.
ఒకటి రెండు శాతం తేడా ఉంటే పర్లేదు. కానీ ఏకంగా 40, 50 శాతం తేడా ఉండటం ఇక్కడ ఆయన దరిదాపుల్లోకి రాడని తెలుస్తోంది. అంటే కేజ్రీవాల్, మమతాబెనర్జీ, కేసీఆర్ లాంటి నేతలందరిని కలుపుకున్న నరేంద్ర మోదీకి ఉన్నంతా క్రేజ్ వీరికి రావడం లేదు. ప్రజలు వీరెవరినీ ప్రధానిగా ఊహించుకుంటలేరని అర్థమవుతోంది.
ప్రధాని అభ్యర్థిగా కేజ్రీవాల్ 12 శాతం, నితీశ్ కుమార్ కు కేవలం 6 శాతం, కేసీఆర్ కు 5 శాతం మంది ఓట్లేశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర అనంతరం కూడా ప్రధాని మోదీ చరిస్మాను ఏ మాత్రం తగ్గించ లేకపోయారు. కానీ కాంగ్రెస్ నేతల్లో మాత్రం కాస్త అభిమానం సంపాదించగలిగాడు. దాదాపు కాంగ్రెస్ లో 29 శాతం మంది విపక్ష నాయకుడిగా ఒప్పుకున్నారు. కేజ్రీవాల్ కు 19 శాతం, మమతను 13 శాతం మంది, నితీశ్ ను 8 శాతం మంది, కేసీఆర్ ను 7 శాతం మంది దేశంలో విపక్ష నేతగా పనికొస్తారని అనుకుంటున్నారు. ఉన్నవాళ్లలో కాస్త మెరుగైన విపక్ష నాయకుడిగా మాత్రం ప్రజలు రాహుల్ ను అంగీకరిస్తున్నట్లే తెలుస్తోంది.