రష్యా నుండి ఆయిల్ సప్లై చేసే నార్డ్ స్ట్రీమ్ గ్యాస్ పైప్ లైన్ ధ్వంసం అయిన విషయం ఆల్రెడీ మనకు అందరికీ తెలిసిందే. సముద్రం అడుగు భాగంలో ఉండే ఈ నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ 1 & 2 లను ధ్వంసం చేశారు అప్పుడు. అయితే ఈ ధ్వంసం చేసింది మీరంటే మీరంటూ చాలా దేశాలు అనుకున్నాయి.  అయితే ఈ గ్యాస్ పైప్ లైన్లు ధ్వంసం అవ్వడం వల్ల రష్యా నుండి యూరప్ కు సరఫరా అయ్యే ఆయిల్ ఇంకా గ్యాస్ ఆగిపోయాయని తెలుస్తుంది.


జర్మనీ ఆర్థిక వ్యవస్థ కూడా అతలాకుతలం అయిపోయిందని తెలుస్తుంది. టర్కీ ద్వారా కూడా ఈ ఆయిల్ ని, గ్యాస్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తారు గాని ఖర్చు ఎక్కువగా ఉంటుందని తెలుస్తుంది. అదే జర్మనీ నుండి అయితే ఈ ఖర్చు తక్కువగా ఉంటుందట. అయితే ఇప్పుడు ఈ ఖర్చు ఎక్కువ అవ్వడంతో అగ్రరాజ్యమైన యూరప్ కూడా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లుగా తెలుస్తుంది.


అయితే అసలు ఈ నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ ని ధ్వంసం చేసింది ఉక్రెయిన్ అని రష్యా అంటే, కాదు రష్యా అని అమెరికా ఇలా మొన్నటిదాకా వాదోపవాదాలు జరిగాయి. కానీ అమెరికానే దీనికి కారణం అని తర్వాత బయటపడిందట. అమెరికా నేతృత్వంలోని సీఐఏ ఈ ధ్వంసం అంతటికి కారణం అని  పులిట్జెర్ అవార్డు గ్రహీత  అయినటువంటి హార్ష్ అనే జర్నలిస్ట్ చెప్పాడని తెలుస్తుంది. అయితే వాషింగ్టన్ పోస్ట్ కూడా నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ ధ్వంసంలో సిఐఏ పాత్రను ప్రత్యేకించి ప్రచురించిందని తెలుస్తుంది.


దాని ప్రచురణ ప్రకారం నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ ధ్వంసం అవుతుందని సిఐఏకు ముందే తెలుసు అని, జరుగుతున్నప్పుడు కూడా తెలుసు అని అది ప్రచురించిందట. అంటే చేయించింది అమెరికాకు సంబంధించిన సీఐఏ. అది పోలాండ్ కి సంబంధించిన ఆరుగురు వ్యక్తులతోనూ ఇంకా బ్రిటన్ తో కూడా కలిసి ఇలా చేసిందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: