నిరుద్యోగ యువతీ యువకులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఏపీ ప్రభుత్వం ప్రధాన మంత్రి మత్య సంపద యోజన ( PMMSY) పధకం ద్వారా శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాలో సాగర మిత్ర ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా పలు రకాల ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. రెండు రాష్ట్రాలలో కలిపి మొత్తం 145 పోస్టులు ఉన్నాయి. గుంటూరు జిల్లాలో కూడా నోటిఫికేషన్ విడుదల చేసినా ఇప్పటికే చివరి తేదీ ముగిసిపోయింది. ఇక ఈ రెండు నోటిఫికేషన్ వివరాలలోకి వెళ్తే..
మొత్తం పోస్టుల సంఖ్య : 145
నెల్లూరు జిల్లాకు :  85 , శ్రీకాకుళం జిల్లాకు 60
అర్హతలు : ఫిషరీస్ లో పాలిటెక్నిక్  లేదా ఫిషరీస్ సైన్స్ లేదా మెరైన్ బయాలజీ , జువాలజీలో బ్యాచలర్ డిగ్రీ ఉత్తీర్ణులు అయ్యి ఉండాలి. ఇందులో పేర్కొన్న అర్హతలు వారికి మాత్రమే ప్రధమ ప్రాధాన్యత  ఉంటుందని గుర్తు ఉంచుకోండి.

వయసు : 30-11-2020 నాటికి 18-౩5  ఏళ్ళ మధ్య వయసు ఉండాలి.

ఎంపిక విధానం :
అభ్యర్ధుల అనుభవం, ఇంటర్వ్యూ సాఫ్ట్ క్సిల్ తప్పకునా పరిగణలోకి తీసుకుంటారు. ఐతే ఇంటర్వ్యూ కు ముందుగా సంభందిత అభ్యర్ధులు స్థానికంగా ఆయా గ్రామాలలో ఉన్నట్లు డిక్లరేషన్ సమర్పించాలి. అలాగే వివిధ భాగాలలూ వెయిటేజ్ ప్రకారం తుది ఎంపిక ఉంటుంది. మెరిట్ అభ్యర్ధులకు 75 శాతం , సాఫ్ట్ సిక్ల్స్ 10 శాతం, ఇంటర్వ్యూ కి 15 శాతం వెయిటేజీ  కేటాయించ బడ్డాయి. అంతేకాదు సొంత జిల్లా వారికి 80 శాతం, స్థానికేతర జిల్లాల వారికి 20 శాతం కేటాయిస్తారు.

దరఖాస్తు చేయు విధానం :  ఆఫ్ లైన్’’

శ్రీకాకుళం జిల్లా  
దరఖాస్తు పంపాల్సిన చిరునామా:
మత్య శాఖ సంయుక్త సంచాలకులు
ఇలిసిపురం,  శ్రీకాకుళం జిల్లా
దరఖాస్తు చివరి తేదీ : 21-01-2021
మరిన్ని వివరాలకోసం  : https://srikakulam.ap.gov.in/

నెల్లూరు జిల్లా 
దరఖాస్తు పంపాల్సిన చిరునామా:
మత్య శాఖ ఉప  సంచాలకులు
నెల్లూరు కార్యాలయం , నెల్లూరు జిల్లా
దరఖాస్తు చివరి తేదీ : 23-01-2021
మరిన్ని వివరాలకోసం  : https://spsnellore.ap.gov.in/
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: