స్కాలర్ షిప్..కొందరికి డబ్బు ఉన్నా చదువు ఉండదు..మరి కొందరికి చదవు ఉంటె డబ్బు ఉండదు. ఎంతో మంది దాతల సహకారంతో పెద్ద పెద్ద చదువులు చదువుకుంటారు. మరి కొందరు కష్టపడి ఫ్రీ సీటు సాధించినా, మరిన్ని అవసరాలకోసం ఎదురు చూపులు చూడాల్సిందే. ఇంకొందరు చదువుకుంటూనే తమ అర్హతలకు తగ్గట్టుగా స్కాలర్ షిప్ లకు అప్లై చేసుకుని సాయం పొందుతారు. కేంద్ర ప్రభుత్వం మొదలుకొని, కొన్ని స్వచ్చంద సంస్థలు వరకూ వివిధ రకాలుగా స్కాలర్ షిప్ లు అందిస్తూ ఉంటాయి. ఇవి విద్యార్ధుల ఆర్ధిక అవసరాలను తీర్చడంలో ఎంతో ఉపయోగపడుతాయి..తాజాగా..

ఇంజనీరింగ్, మెడికల్ చదవాలనుకుంటున్న విద్యార్ధిని విద్యార్ధులకు బడ్డీ ఫర్ స్టడీ ఇండియా అనే సంస్థ డాక్టర్ అబ్దుల్ కలాం స్కాలర్ షిప్ లను అందిస్తోంది.ఈ స్కాలర్ షిప్ ద్వారా అర్హులైన విద్యార్ధులు ఎవరైనా రూ. 20 వేల లను పొందవచ్చు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో మెడికల్, ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ లు వ్రాసే వారు ఎవరైనా సరే ఈ స్కాలర్ షిప్ కు అర్హులుగా సంస్థ తెలిపింది. మరి ఈ స్కాలర్ షిప్ లు ఎలా పొందాలి, అందుకు ఎలాంటి షరతులు, ఉన్నాయి అనే విషయాలు తెలుసుకుందాం..

ఆర్ధికంగా వెనుకబడిన తరగతులు వారు మాత్రమే ఈ స్కాలర్ షిప్ కు అప్ప్లై చేసుకోవాలి

అప్ప్లై చేసేవారి కుటుంభ వార్షిక ఆదాయం రూ.3 లక్షలు లోపు ఉండాలి

ఇంటర్ లో కనీసం 55 శాతం మార్కులతో పాస్ అవ్వాలి

ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా అప్ప్లై చేయచ్చు

ఇంజనీరింగ్ , మెడిసిన్ ఫస్ట్ ఇయర్ , సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు ఇందుకు అర్హులు కారు

కేవలం ఇంజీనిర్, మెడిసిన్ లో చేరాలనుకునే వారు మాత్రమే ఇందుకు అర్హులు.

ఈ స్కాలర్ షిప్ చివరి తేదీ : 15-02-2021

      ముందుగా  టెలిఫోన్ ద్వారా ఇంటర్వ్యూ చేపట్టి ఆ తరువాత నేరుగా ఇంటర్వ్యూ చేస్తారు.

మరింత సమాచారం కోసం
https://www.buddy4study.com/article/abdul-kalam-scholarship

మరింత సమాచారం తెలుసుకోండి: