నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయం నుండి ఇంట‌ర్ బోర్టు కార్య‌ద‌ర్శి ఉమ‌ర్ జ‌లీల్ మీడియాతో మాట్లాడారు. ఉమ‌ర్ జ‌లీల్ మాట్లాడుతూ....లాక్డౌన్ కారణంగా గత మార్చి లో పరీక్షలు నిర్వహించలేదని..దాంతో ఆబ్జెక్టివ్ ప్రకారం మార్కులు కేటాయించామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కరోనా పరిస్థితులు తగ్గాక పరీక్షలు నిర్వహిస్తామని చెప్పామని తెలిపారు. ఇప్పుడున్న సెకండ్ ఇయర్ విద్యార్థులు ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాయలేదని..సిలబస్ మొత్తం కాకుండా కేవ‌లం 70 శాతం సిలబస్ తోనే పరీక్షలు నిర్వహిస్తున్నామ‌ని ఉమ‌ర్ జ‌లీల్ వ్యాఖ్యానించారు. ఒకవేల సెకండ్ ఇయర్ పరీక్షలు కూడా మ‌ళ్లీ కరోనా పరిస్థితుల్లో జరగక పోతే ఈ పరీక్షల ప్రకారం మార్కులు కేటాయించాల్సి ఉంటుందని ఉమ‌ర్ జ‌లీల్ స్ప‌ష్టం చేశారు.

మొత్తం 4 లక్షల 59 వేల‌ మంది విద్యార్థులకు  ఫ‌స్ట్ ఇయ‌ర్ ప‌రీక్ష‌లు నిర్వహిస్తున్నామ‌ని స్ప‌స్టం చేశారు. 1768 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామ‌ని..పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. కరోనా నిబంధనల ప్రకారమే పరీక్షల నిర్వహణ ఉంటుంద‌ని తెలిపారు. అంతే కాకుండా సోమవారం నుండి పరీక్షలు జరుగుతున్నాయని...కలెక్టర్లు, మున్సిపల్, పంచాయతీ రాజ్ అధికారుల సమన్వయం తో పరీక్షలు నిర్వ‌హిస్తున్నామ‌ని తెలిపారు .

మూడు సెట్ల పరీక్ష పత్రాలు సెలెక్ట్ చేసామ‌ని...సొంత వాటర్ బాటిల్ తెచ్చుకోవచ్చు.,మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ఉమ‌ర్ జ‌లీల్ విధ్యార్థుల‌కు ఆదేశించారు. విద్యార్థి కి ఆరోగ్య పరంగా ఇబ్బంది కలిగితే వెంటనే అన్ని చర్యలు తీసుకుంటామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఇదిలా ఉంటే క‌రోనా నేప‌థ్యంలో ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ విద్యార్థుల‌ను సెకండ్ ఇయ‌ర్ కు ప్ర‌మోట్ చేయ‌గా వారికి ఎంసెట్ వెయిటేజీ లో ఇబ్బంది క‌లుగుతుంద‌నే కార‌ణంగా ప‌రీక్ష‌లు నిర్వహించాల‌ని నిర్నయం తీసుకున్నారు. అయితే ప‌రీక్షల‌ను ర‌ద్దు చేయాల‌ని విద్యార్థుల త‌ల్లి దండ్రులు కోర్టుకు వెళ్లినా కోర్టు వారి వాద‌న‌ల‌ను తోసిపుచ్చింది .

మరింత సమాచారం తెలుసుకోండి: