లక్ష్మీదేవి సరస్వతీదేవి ఒకేచోట నిలవరంటారు.పాలమూరు కి చెందిన ఓ విద్యార్థి గాధ చూస్తే అది నిజమేననిపిస్తుంది. కటిక పేదరికం ఆ నిరుపేద విద్యార్థి పాలిట శాపంగా మారింది. చదువుకోవాలనుకున్న ఆమె కలకు పేదరికం అడ్డు గా మారింది. గత ఏడాది ఫ్రీ మెడికల్ సీటు వచ్చినా మినిమం ఫీజు కట్టలేక చదువు పై ఆశలు వదులుకుంది. అయినా మరోసారి ఆమెను నీట్ ర్యాంకు వరించింది.

 ఎవరైనా ఆర్థిక సాయం అందిస్తే చదువుకొని డాక్టర్ అవుతానంటోంది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి చెందిన  గోపిక తండ్రికి తొమ్మిదేళ్ళ క్రితమే పక్షవాతం రావడంతో ఆ కుటుంబం మరింత కష్టాల్లో కూరుకుపోయింది. భగీరథ కాలనీలో చిన్నపాటి టీ స్టాలే ప్రస్తుతం వీరి జీవనాధారం. తల్లి దండ్రుల కష్టాన్ని ప్రత్యక్షంగా చూసిన గోపిక నీట్ కు ప్రిపేర్ అయింది. గత ఏడాది నీట్ పరీక్ష లో ఫ్రీ మెడికల్ సీట్ సాధించింది. కానీ ఆర్థిక ఇబ్బందులు ఆ విద్యార్థిని చదువుకు ఆటంకంగా మారింది. కనీస ఫీజు తో పాటు ఇతర ఖర్చులకు డబ్బులు లేక అడ్మిషన్ తీసుకోలేకపోయింది. ఈసారి నీటి పరీక్ష రాసిన గోపికను ర్యాంక్ వరించింది. 720 మార్కులకు 613 మార్పులతో 13506 వ ర్యాంకు సాధించింది.

ఉత్తమ ర్యాంకుతో మంచి కాలేజీ లో ఫ్రీ మెడికల్ సీట్ సాధించే అవకాశం ఉంది. కానీ అదే ఆర్థిక ఇబ్బందులు గోపిక కుటుంబాన్ని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. అందుకే దాతల సాయం కోసం ఆశగా ఎదురు చూస్తోంది. ఎవరైనా దాతలు సాయం చేసి తమ కూతురు చదువుకు అవకాశం కల్పించాలని తల్లి లక్ష్మి కోరుతుంది. దేశంలో ఎంతోమంది ధనవంతులు ఉన్నారు. రోజుకు అనవసర ఖర్చులు కూడా ఎన్నో చేస్తారు. కానీ ఒక్క రూపాయి కూడా పేదవారికి పెట్టాలంటే వెనకడుగు వేస్తారు. చదువుకోవాలని తాపత్రయం ఉన్నా మనదేశంలో చదువును డబ్బుతో వెల కట్టారు కాబట్టి ఒక పేద విద్యార్థి చదువుకు డబ్బు అడ్డం వస్తోందని ఈ అమ్మాయిని  చూస్తే అర్థం అవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: