యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (UPSC) పరీక్ష దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన పరీక్షలలో ఒకటిగా పరిగణించబడుతుంది ఇంకా దేశంలోనే పాస్ అవ్వడానికి అత్యంత కఠినమైన పరీక్షలలో ఒకటిగా ఈ పరీక్ష పరిగణించబడుతుంది. ప్రతి సంవత్సరం లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరవుతారు. కానీ కొంతమంది అభ్యర్థులు మాత్రమే విజయం సాధిస్తారు. మీరు IAS ఆశించే వారైతే, మీరు IAS అధికారి గోవింద్ జైస్వాల్ విజయగాథను తెలుసుకొని ఆదర్శంగా తీసుకోవచ్చు. గోవింద్ జైస్వాల్ తన 22 సంవత్సరాల వయసులో 2006లో UPSC పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు.అందులో ఆల్ ఇండియా ర్యాంక్ 48 సాధించారు.ఆయన సాధించిన ఈ విజయం వెనుక ఉన్న కృషి ఇంకా పోరాటం ప్రతి విద్యార్థికి స్ఫూర్తి. గోవింద్ కలను నెరవేర్చడానికి అతని తండ్రి నారాయణ్ చాలా కష్టపడ్డారు. అతని కుటుంబం మొత్తం యూపీలోని వారణాసిలో నివసించింది. గోవింద్ తండ్రి నారాయణ్‌కు 1995లో 35 రిక్షాలు ఉండేవి, అయితే అతని భార్య అనారోగ్యం కారణంగా అతను తన 20 రిక్షాలను అమ్మేశారు.

అయితే 1995లో ఆయన భార్యను చావు నుంచి మాత్రం కాపాడలేకపోయాడు.ఇదిలా ఉండగా, యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేందుకు గోవింద్ 2004-2005లో ఢిల్లీ వెళ్లాలని అనుకున్నప్పుడు డబ్బుల కొరత ఏర్పడింది. అయితే తన కొడుకు కలను నెరవేర్చుకునేందుకు అతని తండ్రి మిగిలిన 14 రిక్షాలను కూడా అమ్మేశాడు. ఇప్పుడు అతనికి ఒక రిక్షా మాత్రమే మిగిలి ఉంది. దానిని అతను స్వయంగా తొక్కడం ప్రారంభించాడు.ఇక అప్పట్నుంచి గోవింద్ తండ్రి నారాయణ్ తన కొడుకు చదువుల కోసం రిక్షా యజమాని నుండి రిక్షా తొక్కేవాడిగా మారాడు. ఆయన కాలికి జబ్బు వచ్చినా కాని తన కొడుకు తన లాగ కష్టపడకూడదని గోవింద్ చదువుకు ఆటంకం కలగకుండా ఎంతో కష్టపడి రిక్షా తొక్కుకుంటూ తన కొడుకుని చదివించాడు. గోవింద్ తన తండ్రి కష్టాన్ని తెలుసుకొని తన దృష్టిని చదువులో పెట్టి చాలా కష్టపడి చదువుకున్నాడు.ఇక 2006 వ సంవత్సరంలో UPSC మొదటి ప్రయత్నంలో 48వ ర్యాంక్ సాధించాడు.ఇప్పుడు పెద్ద ఐఏఎస్ అధికారి అయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: