సాఫ్ట్ వేర్ ఉద్యోగం చాలా మంది కుర్రాళ్లకు ఓ డ్రీమ్‌.. అందుకే ఇంజినీరింగ్‌కు అంత డిమాండ్ ఉంటుంది. అయితే ఇంజినీరింగ్ చేయకపోతే సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు రావా.. లక్షల్లో జీతాలు అందుకోలేరా అనే వారికి సమాధానంగా నిలుస్తోంది కంప్యూటర్ సైన్స్ కోర్స్.. ఈ కంప్యూటర్ సైన్స్ కోర్స్ చేసిన విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్యార్థులతో సమానంగా జాతీయ స్థాయిలో అనేక ఉద్యోగావకాశాలు  ఉంటున్నాయి. ఈ విషాయన్ని నొక్కి చెబుతున్నారు కె ఎల్ విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుబ్రహ్మణ్యం.


కె ఎల్ విశ్వవిద్యాలయం ఇప్పుడు ఈ సబ్జక్టులో బిఎస్సి హానర్స్ కోర్సు ఆఫర్‌ చేస్తోంది. ఈ కోర్టు చేసిన విద్యార్థులకు ఉద్యోగావకాశాలు వెంటనే లభిస్తున్నాయట. అంతే కాదు.. ఈ కోర్సు చేస్తే  అంతర్జాతీయంగా ఉన్నత విద్యావకాశాలు కూడా బాగా ఉన్నాయట.  కోవిడ్-19 తర్వాత శాస్త్ర సాంకేతిక రంగాలలో పెను మార్పులు చోటు చేసుకున్నాయని కె ఎల్ విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ప్రిన్స్‌పల్‌ సుబ్రహ్మణ్యం చెబుతున్నారు.


కె.ఎల్.డీమ్డ్ విశ్వవిద్యాలయంలో 2022-23 విద్యా సంవత్సరం నుంచి కొత్తగా బిఎస్సి కంప్యూటర్ సైన్స్ కోర్స్ ను  ఘనంగా ప్రారంభించామని  కె ఎల్ విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ప్రిన్స్‌పల్‌ సుబ్రహ్మణ్యం  వివరించారు. బిఎస్సి డిజిటైజషన్ లో దూసుకు పోడానికి కంప్యూటర్ సైన్స్ ఎంతగానో ఉపయోగ పడుతుందని  కె ఎల్ విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ప్రిన్స్‌పల్‌ సుబ్రహ్మణ్యం వివరించారు.


ఈ డిజిటల్ యుగంలో విద్యార్థులు సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, కృత్రిమ మేథలలో నైపుణ్యాలను పెంచుకుంటే మెరుగుగా రాణిస్తారని  కె ఎల్ విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ప్రిన్స్‌పల్‌ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఇలాంటి కోర్సులు చేయడం ద్వారా విద్యార్థులు పరిశోధనా రంగంలో రాణిస్తూ, జాతీయ స్థాయి పరిశ్రమలు నెలకొల్పడానికి కావలసిన నైపుణ్యాలు సాధించుకో గలుగుతారని  సుబ్రహ్మణ్యం అంటున్నారు.  ఈ కోర్స్ లో సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ మరియు కృత్రిమ మేథ స్పెషలిజషన్స్ అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: