తెలంగాణ ప్రభుత్వం నిరుద్యొగుల పాలిట బంగారు హస్తం అయ్యింది. గత ఏడాది కరోనా కారణంగా ఆర్థిక పరిస్థితుల ఎదురైన సంగతి తెలిసిందే..ఇప్పుడీప్పుడే రాష్ట్రం మళ్ళీ ఆర్థికంగా పుంజుకుంటున్న సంగతి తెలిసిందే..ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రవేట్ సంస్థలలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సర్కార్.. ఇప్పటికే ప్రముఖ కంపెనీలలో ఉన్న పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది..కొన్ని పోస్టులకు సంబంధించిన ఉద్యొగాలు భర్థీ అయ్యాయి. ఇప్పుడు మరో నోటిఫికేషన్ నిరుద్యొగులకు వరం లా మారింది.



ఇటీవల స్టాఫ్ సెలెక్షన్ కమీషన్ కింద ఉన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తుంది. ఇప్పుడు మరో ప్రభుత్వ శాఖలో ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు అధికారిక సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.ఈ నోటిఫికేషన్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీకి జరుగుతుంది.ఎస్పిడీసిఎల్ లో 70 అసిస్టెంట్ ఇంజినీరింగ్ పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం అయ్యాయి. 1201 ఉద్యోగాలకు తాజాగా నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఇందులో 1000 ఉద్యోగాలు జూనియర్ లైన్ మెన్ పోస్టులకు ఈ నెల 19 నుంచి దరకాస్తులను స్వీకరించనున్నారు. 



అలాగే 201 సబ్ ఇంజినీర్ పోస్టులకు వచ్చే నెల 15 వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు.లైన్ మెన్ ఉద్యోగాలకు 17న పరీక్షలు నిర్వహించగా,సబ్ ఇంజనీర్ పోస్టులకు జూలై 31 న పరీక్షలను నిర్వహిస్తారని తెలుస్తుంది. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తీ విషయాలను అదికారిక వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చేసుకోవాలి. ఈ ఏడాదిలో మరి కొన్ని ప్రభుత్వ సంస్థలు ఉద్యోగాల భర్థికి నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నాయి. ఈ నోటిఫికేషన్ ల ద్వారా చాలా మంది ఉద్యోగాలను పొందవచ్చునని సర్కారు పేర్కొన్నారు.. మరో వైపు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ సంస్థల లోని ఉద్యొగాలకు సంబంధించిన నోటిఫికేషన్ లను విడుదల చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: