ఇక ఉద్యోగార్థలుకు ఇండియన్ రైల్వే మంచి శుభవార్తని చెప్పింది. పదోతరగతి పాసైన అభ్యర్థులకి మంచి అవకాశం ఇచ్చింది. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (SECR) యొక్క వివిధ ట్రేడ్‌లలో 2077 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ని రిలీజ్ చేయడం జరిగింది.ఇక ఎటువంటి పరీక్ష లేకుండా కేవలం పదోతరగతి విద్యార్హతతోనే ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.


ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇంకా అలాగే నోటిఫికేషన్ వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ అయిన https://secr.indianrailways.gov.in/ ను సందర్శించాల్సి ఉంటుంది. అయితే నాగ్‌పూర్ డివిజన్ కోసం దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ వచ్చేసి జూన్ 3, 2022 వరకు అలాగే రాయ్‌పూర్ డివిజన్ కోసం దరఖాస్తు సమర్పించడానికి మే 24, 2022 వరకు కూడా అవకాశం ఉంది.


ఇక ఈ పోస్టుల పూర్తి వివరాల విషయానికి వస్తే..
నాగ్‌పూర్ డివిజన్ కోసం మొత్తం పోస్టుల సంఖ్య : 1044
రాయ్‌పూర్ డివిజన్ కోసం మొత్తం ఖాళీల సంఖ్య: 1033


అలాగే విద్యార్హతల విషయానికి వస్తే..
ఇక అభ్యర్థి తప్పనిసరిగా 10వ తరగతి లేదా గుర్తింపు పొందిన బోర్డు నుంచి తత్సమాన పరీక్షలో ఖచ్చితంగా ఉత్తీర్ణులై ఉండాలి. అంతే కాకుండా 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు అనేది ఉంటుంది.


ఈ పోస్టులకు ఎలా అప్లై చేయాలంటే..
Step 1: ఫస్ట్ అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ అయిన https://www.apprenticeshipindia.gov.in/login ని ఓపెన్ చేయాలి.
Step 2: ఆ తరువాత హోం పేజీలో కనిపించే 'Online application for engagement of apprentices for the year 2022' లింక్ పై క్లిక్ చేయాలి.
Step 3: తరువాత కావాల్సిన అన్ని వివరాలను కూడా నమోదు చేయాలి. ఇక అందులో సూచించిన సర్టిఫికేట్లను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
Step 4: అప్లికేషన్ ఫామ్ నింపడం పూర్తయిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయాలి.
Step 5: తరువాత ఆ అప్లికేషన్ ఫామ్ ప్రింట్ కాపీని భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: