నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఇండియన్ బ్యాంక్ లో ఉద్యోగాలు..ఇక తాజాగా మరో ప్రముఖ బ్యాంక్ ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ ను విడుదల చేయడం జరిగింది.భారత ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన ఇండియన్‌ బ్యాంక్‌ పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్‌ ని జారీ చేసింది.చెన్నైలో పలు విభాగాలకు సంభందించిన విభాగాల్లో ఉన్న స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులను వారు భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 24 మే న స్టార్ట్ అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 312 ఖాళీలను భర్తీ చేయనున్నారు.ఈ ఉద్యోగాలకు సంబందించిన ఖాళీలు పూర్తీ వివరాలు..మొత్తం 312 ఖాళీల వివరాలు..వీటిలో సీనియర్‌ మేనేజర్లు, మేనేజర్లు, అసిస్టెంట్‌ మేనేజర్లు ఇంకా చీఫ్‌ మేనేజర్‌ పోస్టులు ఉన్నాయి. క్రెడిట్‌, అకౌంట్స్‌, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, డేటా అనలిస్ట్‌, ఐటీ ఇంకా డిజిటల్‌ బ్యాంకింగ్‌ వంటి విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు.పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఇంకా సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌, ఇంకా సీఏ/ ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణత పొంది ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి.అభ్యర్థుల వయసు పోస్టుల ఆధారంగా 23 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి.



పూర్తి వివరాలు విషయానికి వస్తే..ఆసక్తి ఇంకా అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.ఇక అభ్యర్థులను రాత పరీక్ష/ ఆన్‌లైన్‌ టెస్ట్‌ ద్వారా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. ఆ తరువాత ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక ఉంటుంది.ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఫీజుగా రూ.175, ఇంకా అలాగే ఇతరులు రూ. 850 చెల్లించాల్సి ఉంటుంది.తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ, విశాఖపట్నం ఇంకా హైదరాబాద్‌లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.ఇక దరఖాస్తుల స్వీకరణకు 14-06-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.ఈ నోటిఫికేషన్ ను పూర్థిగా చదివి ఉద్యొగాలకు అప్లై చేసుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: