ఆంధ్ర ప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు గురించి సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ రోజు వస్తున్నాయి ఇంకా రేపు వస్తున్నాయంటూ అనేక రకాల వార్తలు షికార్లు చేస్తున్నాయి.ఇక ఈ నేపథ్యంలోనే ఫలితాల విడుదలపై (AP Inter Results 2022) పూర్తి క్లారిటీ లేకపోవడంతో విద్యార్థులు ఇంకా అలాగే వారి తల్లిదండ్రులు ఫుల్ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్‌ బోర్డు (Board of Intermediate education Andhra Pradesh) పూర్తి స్పష్టత ఇచ్చింది.ఇక ఇంటర్‌ పరీక్ష పత్రాల వాల్యూవేషన్ ప్రాసెస్ జరుగుతుందని.. ఈ నెల 25 వ తేదీ తర్వాతే ap Inter Results విడుదల చేస్తామని వెల్లడించారు. అయితే ఈ ఇంటర్‌ పరీక్షలను మే 6 వ తేదీ నుంచి 24 వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది దాదాపు 4,64,756 మంది ఇంటర్ స్టూడెంట్స్ ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఆ ఫలితాలు వచ్చాక విద్యార్థులకు డిజిటల్ స్కోర్ కార్డ్స్ కూడా అందిస్తారు.


ఇక అలాగే ఇంటర్‌ పరీక్షలకు హాజరైన విద్యార్థులు ap Inter Results విడుదలైన అనంతరం https://bie.ap.gov.in/ వెబ్‌సైట్ల ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. ఇంటర్ ఫస్టియర్ ఇంకా సెకండియర్ లో ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతి సబ్జెక్టులో 33 కంటే ఎక్కువ మార్కులు రావాల్సి ఉంటుంది.అలాగే 90 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వ స్కాలర్ షిప్స్‌కు కూడా అర్హత సాధిస్తారు.ఇక ఈ సారి పదోతరగతి విద్యార్థులకు బెటర్‌ మెంట్‌ పరీక్షలు కూడా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి విదితమే. ఇక ఎన్నడూ లేని విధంగా పదో తరగతి విద్యార్థులకు బెటర్‌మెంట్‌ పరీక్షను రాసే అవకాశం కూడా కల్పించారు. ఇక ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించి తక్కువ మార్కులు సాధించిన విద్యార్థుల కోసం ఈ అవకాశాన్ని వారు కల్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: