విద్యార్దులు తమ విద్యార్హతకు తగ్గట్లుగా నిత్యం పోటీ పరీక్షలకు ప్రయత్నిస్తూ ఉంటారు. కొందరు అనుకున్న విధంగా వారు కోరుకున్న లక్ష్యం చేరుకోగా మరి కొందరు మాత్రం ఎన్ని సార్లు ప్రయత్నిస్తున్నా ఓటమి పాలవుతుంటారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే కొందరు విద్యార్దులు టాప్ ర్యాంకర్లు అయుండి కూడా పోటీ పరీక్షల్లో నెగ్గుకు రాలేక ఓటమి పాలు అవుతుంటారు. అయితే ఇందుకు పలు కారణాలు ఉండొచ్చు కానీ... ముఖ్యంగా ఎక్కువగా వినిపించే కారణం ఒత్తిడి. పరీక్ష అంటేనే విద్యార్దులు ఒక రకమైన ఒత్తిడికి లోనవుతుంటారు. అందులోనూ పోటీ పరీక్షలు అంటే ఇక వేరే చెప్పనక్కర్లేదు. కొందరు విద్యార్థులు ఎంత ఒత్తిడికి లోనవుతారు అంటే...వారు నిష్ణాతులు అయిన విషయాలను కూడా గుర్తు పెట్టుకోవడానికి నానా అవస్థలు పడుతుంటారు.

ఒత్తిడికి గురై పోటీ పరీక్షలకు సరిగా సంసిద్ధం కాలేరు. ఇలాంటప్పుడు వారు తమ ఒత్తిడిని తగ్గించుకుంటే కానీ సరిగ్గా ఎఫర్ట్స్ పెట్టి విజయాన్ని అందుకోలేరు. అయితే ఒత్తిడిని తగ్గించుకోవడం ఎలా.. అంటే మేదావులు ఈ విధంగా చెబుతున్నారు. విద్యార్థి ఎవరైనా... పరీక్ష ఏదైనా ముందుగా మీకు మీరు ప్రశాంతగా ఉండి.. దైర్యంగా అటెంప్ట్ చేయాలి. ఒత్తిడి పడితే ఒక పరీక్షల్లోనే కాదు ఎందులోనూ సక్సెస్ కాలేరు.

ఒత్తిడి అనేది తల్లితండ్రులు అలాగే ఇతరుల వలన కూడా పెరిగి అది విద్యార్థుల పై ప్రభావం చూపుతుంది.  విజేతలకు పరాజితులకు ఉన్న తేడా చిన్నదే కానీ... దాని ఫలితంలో మాత్రం చాలా వ్యత్యాసం ఉంటుంది. విద్యార్థుల భయం , వారి లో పట్టుదల కూడా కొన్నిసార్లు ఒత్తిడికి లోనయ్యేలా చేస్తాయి. అలాగే తల్లిదండ్రుల అవగాహన లేమి, ఇతరులతో పోల్చే లక్షణం, అధ్యాపకుల వ్యవహార శైలి ఇవన్నీ కూడా విద్యార్థులపై ఒత్తిడి పెంచుతాయి.  బావోద్వేగాలను అదుపు చేసుకోగలిగి... నమ్మకాన్ని కోల్పోకుండా గట్టిగా  ప్రయత్నిస్తే పోటీ పరీక్షల్లో విజయం సాధించడం అంత కష్టమేమీ కాదు అంటున్నారు విద్యావేత్తలు.

మరింత సమాచారం తెలుసుకోండి: