ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ రిజల్ట్స్ చేసిన అనంతరం విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సప్లిమెంటరీ తేదీలను కూడా ప్రకటించారు.జూన్ 30 వ తేదీ నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉందని తెలిపారు. ఇంకా ఆగస్టు 1వ తేదీ నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభించనున్నామని మంత్రి చెప్పారు.ఇక ఇదే విధంగా ఆగస్టు నెలాఖరులోగా అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు సైతం వెల్లడించే దిశగా చర్యలు తీసుకుంటామని కూడా విద్యాశాఖ మంత్రి పేర్కొన్నారు.ఇక తెలంగాణలో ఫస్టియర్‌లో దాదాపు 37 శాతం మంది విద్యార్థులు ఫెయిల్ కాగా, సెకండియర్ ఫలితాలలో మొత్తం 33 శాతం మంది ఫెయిల్ అయ్యారు. అయితే ఈ ఇంటర్ ఫలితాలలో మార్కులు తక్కువొచ్చినా, లేక ఫెయిన్ అయినా మీరు ఆందోళన చెందాల్సిన పనిలేదు. జూన్ 30 నుంచి రీకౌంటింగ్ ఇంకా రీ వెరిఫికేషన్ కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించాయి రాష్ట్ర ఇంటర్ బోర్డ్ ఇంకా విద్యాశాఖ. చాలా జాగ్రత్తలు జవాబు పత్రాలు వ్యాల్యుయేషన్ చేశారని ఇక ఈ ఫలితాలలో ఎలాంటి పొరపాట్లు లేవని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.


కరోనా మహమ్మారి కారణంగా అకడమిక్ ఇయర్ ఆలస్యం కావడం ఇంకా పూర్తి సిలబస్ కాదని భావించిన విద్యాశాఖ కేవలం 70 శాతం సిలబస్ తో ఇంటర్ పరీక్షలను నిర్వహించింది. అయితే జేఈఈ మెయిన్స్ లాంటి పరీక్షలు ఇంకా అలాగే ఇతరత్రా కారణాలతో ఇంటర్ పరీక్షలను రెండు సార్లు రీ షెడ్యూల్ చేశామని కూడా మంత్రి సబితా పేర్కొన్నారు.ఇక ఇంటర్ ఫస్టియర్‌లో 63.32 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ ఇంటర్ ప్రథమ సంవత్సరంలో అమ్మాయిలే పైచేయి సాధించారు. ఫస్టియర్‌లో అమ్మాయిలు 1,68,692 మంది పాస్ (72.30 శాతం), ఇంకా అబ్బాయిలు 1,25,686 మంది (54.20 శాతం) పాస్ అయ్యారు. ఇంటర్ సెకండియర్‌లో మొత్తం 67.16 శాతం మంది విద్యార్థులు పాసైనట్లు మంత్రి వెల్లడించారు. ఇక విద్యార్థులు ఒత్తిడికి లోనుకావొద్దని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. జేఈఈ మెయిన్స్ పరీక్షల తేదీలు రావడంతో ఇంటర్ ఎగ్జామ్స్ కూడా రీషెడ్యూల్ చేశామన్నారు. తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ ఇంకా సెకండియర్ పరీక్షల ఫలితాలు ఒకేసారి విడుదల చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: