మీరు పదవ తరగతి పాసయ్యారా... పదో తరగతి క్వాలిఫికేషన్ తో గవర్నమెంట్ జాబ్ అందుకోవాలి అనుకుంటున్నారా అయితే ఇదిగోండి ఈ జాబ్ కు మీరు అర్హులు అన్న విషయం తెలుసుకోండి.

పోస్టాఫీసు జాబ్స్: దేశవ్యాప్తంగా ఉన్న పలు పోస్టాఫీసుల్లో గ్రామీణ్‌ డాక్ సేవక్‌లుగా పనిచేసేందుకు ఇండియా పోస్ట్ రిక్రూట్‌మెంట్ చేసుకుంటున్నట్లు విడుదల చేశారు. 10వ తరగతి పాస్ అయితే చాలు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు .అయితే ఈ ఉద్యోగాలకు కొరకు ఎలాంటి రాత పరీక్ష ...లేదా ఇంటర్వ్యూ గాని ఉండదు. కేవలం 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగానే మిమ్మల్ని ఎంపిక చేస్తారు. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‌, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, పోస్ట్ మ్యాన్ జాబ్స్ కు దరఖాస్తు చేసుకోవచ్చు.

బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్: పదో తరగతి పాస్ అయిన వారికి బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ కూడా ఉంది. దీనిలో గ్రూప్ సీ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టులు వంటివి ఉన్నాయి. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) కానిస్టేబుల్‌ వంటి ఉద్యోగాలు కూడా ఎప్పుడూ పడుతూనే ఉంటాయి. సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీసు ఫోర్స్‌, నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ,  రైఫిల్‌మెన్‌ ఇన్‌ పోస్టులు,సెక్రటేరియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌  కూడా ఉన్నాయి.

ఆర్మీ జాబ్స్: పదో తరగతి పాస్ అయిన వారికి రైల్వే రంగంలో చాలా జాబ్స్ అందుబాటులో ఉన్నాయన్న విషయం చాలా మందికి తెలియక పోవచ్చు. సెక్యూరిటీ, గార్డ్స్, లైన్ మెన్ లాంటి ఎన్నో జాబ్స్ ఉంటాయి. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోనూ ఉద్యోగాలు పడుతూ ఉంటాయి. అలానే ఆర్మీ జాబ్స్ కూడా అర్హత పదో తరగతి పాస్ అయితే చాలు.

ఆరోగ్య శాఖ లోనూ పదో తరగతి కి సంబందించి పలు పోస్ట్లు ఉంటాయి.  

అంగన్‌వాడీ పోస్టులు: పది తరగతి పాస్ అయిన వారు  అంగన్‌వాడీ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ పోస్టుకు కేవలం మహిళలు మాత్రమే అర్హులు. ఇందులో అంగన్‌వాడీ టీచర్, మినీ అంగన్‌వాడీ టీచర్, అదే విధంగా సహాయకుల పోస్టులున్నాయి. మహిళా శిశు సంక్షేమ శాఖలో కూడా పలు రకాల జాబ్ లు ఉంటాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: