ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ ఏపి ప్రజలకు గొప్ప శుభవార్తను వినిపించింది. తమ సంస్థలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కాగా ఏపీలోని యువత కు ఉద్యోగాలను కల్పించి భర్తీ చేయనున్నట్లు తీపి కబురు వెల్లడించింది. ఉద్యోగాలు కల్పించడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండి, సీఈఓ ఎస్.సత్యనారాయణ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. వందల్లో కాదు వేల సంఖ్యలో ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు. మొత్తంగా దాదాపు 2500 వరకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు చెబుతూ ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులతో ఈ ఖాళీలను భర్తీ చేయబోతున్నట్లు వెల్లడించారు.

అయితే ఇందులో 75 శాతం మందికి స్థానిక యువతకు అవకాశం కల్పించి మిగిలిన 25 శాతం ఓపెన్ క్యాటగిరీ కింద భర్తీ చేయబోతున్నాం అంటూ తెలిపారు. ఈ విధంగా స్థానిక యువతకు ఎంతో మేలు చేకూరుతుందని అన్నారు. ఈ స్థానిక యువతకు ఇలా రిజర్వేషన్ కల్పించడం లో.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ గారి పాత్ర ఎక్కువ ఉందని రాష్ట్రం కోసం ఎల్లప్పుడూ తపించే ఆయన జనాలకు మంచి చేయడానికి అవకాశాల కోసం ఎదురు చూసే వ్యక్తి కాదని అవకాశాలను అందుకుని ఆదుకునే మహనీయుడు అంటూ ప్రశంసలు కురిపించారు . నిరుద్యోగతను రూపుమాపేందుకు ఏపీ ప్రభుత్వం ఎప్పుడూ ముందు ఉంటుందని, ఫ్లిప్కార్ట్ అధికారులు ప్రశంసలు కురిపించారు.

ఇక ఈ సంస్థలో ఉద్యోగాలు అందుకోవడం కొరకు అర్హతలు మరియు ఉద్యోగ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.  

అర్హతలు: పది, ఇంటర్, డిగ్రీ మరియు పీజీ పూర్తి చేసి ఉండవలెను.

జీతం: స్టార్టింగ్ రూ.18,000 నుండి రూ.3,00,000.. వరకు ప్రాధాన్యతను బట్టి ఉంటుంది.  ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకొనే వారు ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ లో నోటిఫికేషన్ ను విపులంగా చదివి అప్లై చేసుకోవాలి మరి ఇక ఆలస్యం ఎందుకు వెంటనే అప్లై చేసుకుని ఉద్యోగాలను పొందగలరు.

మరింత సమాచారం తెలుసుకోండి: