ఇక డిగ్రీలు చేసి బయటకు వచ్చే విద్యార్థులు తక్కువ మందే ఏదో ఒక ఉద్యోగం చేస్తున్నారు. మిగతా వారికి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి సరిగ్గా లేకపోవడం.. ఇంకా చదివిన చదువులో అంతగా పరిజ్ఞానం సాధించకపోవడంతో వారు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. అందుకే డిగ్రీ చేసిన వాళ్లు చాలామంది కూడా ఓపెన్ యూనివర్సిటీల్లో.. ఇంకా ఇతర విద్యాసంస్థల్లో సర్టిఫికేట్ కోర్సులు నేర్చుకుంటున్నారు. అయితే వీటిని చదివినంతమాత్రానా ఉద్యోగ అవకాశాలు ఉంటాయా అంటే అది చెప్పలేని పరిస్థితి. అయితే ఇక్కడ చెబుతున్న ఓ కోర్సు కనుక బాగా నేర్చుకుంటే.. వెంటనే మీరు ఉద్యోగం సాధించే అవకాశం ఉంటుంది. దాని గురించి ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం.. విజువల్ కమ్యూనికేషన్‌.. ఈ కోర్సులో కెరీర్ చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ కోర్సుకు సగటు ఫీజు సంవత్సరానికి రూ. 30,000 నుండి రూ. 3,00,000 ఉంటుంది.ఇక BA విజువల్ కమ్యూనికేషన్ అనేది ఎక్కువగా పాపులారిటీ సాధించిన కోర్సు. ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత విద్యార్థికి అనేక రకాల ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉంటాయి.


బీఏ తర్వాత విద్యార్థులు విజువల్ కమ్యూనికేషన్‌లో ఎంఏ చేసి ఆ తర్వాత వారు రీసెర్చ్ వర్క్ కూడా చేయవచ్చు.ఇక అనేక కళాశాలలు BA విజువల్ కమ్యూనికేషన్ కోర్సు కోసం ఆన్‌లైన్ ప్రవేశ ప్రక్రియను నిర్వహిస్తాయి. ఈ BA విజువల్ కమ్యూనికేషన్ కోర్సును అభ్యసించడానికి, ఆన్‌లైన్ ప్రవేశ ప్రక్రియలో అత్యంత ముఖ్యమైన దశ విశ్వవిద్యాలయాలు నిర్వహించే పరీక్షలలో మంచి స్కోర్ ని చేయడం. ఇంకా అలాగే విద్యార్థులు 10+2 పరీక్షలో ఏదైనా స్ట్రీమ్‌లో మంచి మార్కులు కూడా తెచ్చుకోవాలి. ఈ ప్రవేశ పరీక్షల కోసం దరఖాస్తులను ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి చివరి నాటికి విడుదల చేస్తారు. ఇక ఒక విద్యార్థి ప్రవేశ పరీక్షలో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించిన తర్వాత.. వారిని కౌన్సెలింగ్ కోసం పిలుస్తారు. ఆపై వారిని ప్రవేశ ప్రక్రియ కోసం పిలుస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: