ఇక కానిస్టేబుల్ కావాలనే కోరిక ఉంటే సరిపోదు. ఇంకా దానికి తగినట్టుగా ప్రిపేర్ కావాల్సిన ఆవసరం ఏంతైనా ఉంది. 2016 ఇంకా 2018 నోటిఫికేషన్లతో పోల్చితే ఈ సారి కానిస్టేబుల్ క్వశ్చన్ పేపర్ ప్యాట్రన్ ను మార్చారు. ముందు డైరెక్టుగా క్వశ్చన్ పేపర్ అనేది ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అయితే పరిస్థితి అలా లేదు. బ్యాంకింగ్ సెక్టర్, స్టాఫ్ సెలెక్షన్ సెక్టర్ ఇంకా సివిల్ బేస్ క్వశ్చన్ లాగా ప్రిపేర్ చేస్తున్నారని నిపుణులు అంటున్నారు. మొత్తం 22 సంవత్సరాల అనుభవంతో తన సలహాలు సూచనలు చేశారు ఆయన. కానిస్టేబుల్ కు కేవలం ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అలాగే ఇంటర్ సెకండియర్ చదివే వారు కూడా అప్లై చేసుకునే పరిస్థితి ఉంటుంది. చిన్న వయస్సులో ఉద్యోగం సంపాదించుకుంటే ఆ కుటుంబం బాగా సెట్ అవుతుంది. ఇది చాలా మంచి సర్వీస్ ప్లాట్ఫామ్ కూడా. కరోనా మహమ్మారి సమయంలో ప్రైవేట్ ఉద్యోగాలతో (Private Jobs) ఇబ్బందులు పడిన అనేక మంది ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు. కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఆగస్టు 21 వ తేదీన నిర్వహించనున్నారు. కానిస్టేబుల్ కావాల్సిన వారు తప్పని సరిగా ప్రిలిమ్స్ అనేది క్వాలిపై కావాల్సి ఉంటుంది. ఒక వేళ మీరు క్వాలిఫై కాకపోతే కానిస్టేబుల్ అవ్వాలన్న మీ కల ఇక గల్లైంతైనట్లే. ఇంకా కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది.


అందులో మొత్తం 60 మార్కులు తెచ్చుకుంటే మనం ప్రిలిమ్స్ క్వాలిఫై అయినట్లే లెక్క. 60 మార్కులు సాధించడం ఎలా అనేది మనం తెలుసుకుందాం. మీరు ప్రీవియస్ గా చదువుకున్న టెన్త్ ఇంకా ఇంటర్ వరకూ ఉన్న సిలబస్ మాత్రమే ఈ పరీక్షలో ఉంటుంది.అసలు కొత్తగా ఏమీ ఉండదు.ఇక తెలంగాణ ఉద్యమం ఏ విధంగా జరిగింది? తెలంగాణ రాష్ట్ర హిస్టరీ అంటే ఏంటి? ఇంకా ఇండియన్ హిస్టరీ అంటే ఏంటి? అనే ఈ మూడు టాపిక్స్ కనుక చదువుకుతుంటే మీకు యాభై మార్కులు వస్తాయి.అలాగే ఇంకా రీజనింగ్, మ్యాథ్స్ చాలా ఈజీ గా ఉంటుంది. క్వాలిఫై కావాలి అనుకునే వారు ఏదన్న డౌట్ ఉన్న వారు మీరు మొదటగా తెలంగాణ హిస్టరీ, ఇండియా హిస్టరీ ఇంకా బ్లడ్ రిలేషన్స్ డిస్టెన్స్ అండ్ డైరెక్షన్స్ మీద ఫోకస్ ఎక్కువ చేస్తారు. కోడింగ్-డీకోడింగ్ మీద కూడా మొత్తం 25 క్యశ్చన్స్ అడుగుతున్నారు. 2016, 2018 లో అడిగిన క్వశ్చన్స్ అన్నీ ఇవే టాపిక్స్ పై పేపర్ లో ఎక్కువగా అడిగారు.ఇంకా అర్ధమెటిక్స్ లో కొన్ని టాపిక్స్ మాత్రమే తీసుకోండి.. నంబర్ సిస్టమ్స్, పర్సెంటేజ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఇంకా టైం అండ్ వర్క్ టైమ్ అండ్ డిస్టెన్స్ ఈ టాపిక్ మేజర్ గా తీసుకున్నట్లయితే వీటిపై బాగా పోకస్ చేస్తే ఈ ఇరవై ఐదు రోజుల్లో మీరు ఈజీగా క్వాలిఫై కావచ్చు. అలాగే ఇంకోటి ఏంటంటే మెన్సురేషన్ క్షేత్రమితి ఎవరైతే పర్ఫెక్ట్ చేస్తే.. కేవలం ఇప్పుడు మాత్రమే కాదు ఇంకా మెయిన్స్ ఎగ్జామ్ లో కూడా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మీరు చదివింది ఇక్కడితో అయిపోదు.ఈ చదివిందంతా కూడా మీకు మెయిన్స్ లో కూడా బాగా ఉపయోగపడుతుంది. మెయిన్స్ లో ఎక్కువ స్కోర్ చేయాలంటే ఇప్పుడు ప్రిపేర్ అయితే అప్పటికి బాగా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణ హిస్టరీ ఇంకా ఇండియన్ హిస్టరీ చాలా ముఖ్యం. వీటిని కనుక బాగా చదువుకుంటే మీరు ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. కచ్చితంగా మీరు పోలీస్ కానిస్టేబుల్ జాబ్ కొడుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: