ఇక విద్యార్థి దశలో చాలా కీలకమైంది పదో తరగతి. మనం ఎటువంటి జాబ్ కి అప్లయి చేయాలన్నా కావాల్సిన వాటిలో టెన్త్ సర్టిఫికేట్ అనేది చాలా తప్పనిసరి.. అంత ముఖ్యమైన సర్టిఫికెట్ ని అనుకోకుండా పోగొట్టుకుంటే ఖచ్చితంగా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.ఇక అలాంటప్పుడు ఏం చేయాలి. తిరిగి మనం టెన్త్ సర్టిఫికేట్ తెచ్చుకోవడం ఎలా? అంటే ఖచ్చితంగా అధికారుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అంత కష్టం అవసరం లేదు. మీకు ఒక సులభమైన విధానం అమల్లోకి వచ్చింది. మనం పోగొట్టుకున్న టెన్త్ సర్టిఫికెట్ ఈజీగా తిరిగి పొందాలంటే కేవలం ఇంటర్నెట్ ఉంటే చాలు. ఇంటర్నెట్ ద్వారా మనం చాలా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


ఇక పదో తరగతి సర్టిఫికెట్ ఆన్ లైన్ లో ఎలా పొందాలి?


మనం పోగొట్టుకున్న పదో తరగతి సర్టిఫికెట్ పొందేందుకు మీ వద్ద హాల్ టికెట్ నబంర్ లేదా ఆ సర్టిఫికెట్ జిరాక్స్ కాపీ అయినా ఖచ్చితంగా ఉండాల్సిందే..మొదటగా memos.bseap వెబ్ సైట్ ని మీరు ఓపెన్ చేయాలి.తరువాత SSC బోర్డుకు సంబంధించిన డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ పేజీ కనిపిస్తుంది.అక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ఇంకా డేట్ ఆఫ్ బర్త్, ఏ సంవత్సరంలో పరీక్ష రాశారు అలాగే రెగ్యులరా లేదా సప్లిమెంటరీనా లేదా ప్రైవేట్ అని ఉంటాయి. వాటిని మీరు ఎంటర్ చేయాలి.ఇంకా అలాగే కింద నంబర్ కోడ్ కూడా ఉంటుంది. అక్కడ టైప్ చేసి తరువాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి.ఆ విధంగా మీ వివరాలు అన్ని కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.మీ వివరాలన్నీ కనుక కరెక్ట్ గా ఉంటే మీ ఒరిజినల్ సర్టిఫికెట్ అనేది మీకు కనబడుతుంది.ఇక దానిని ప్రింట్ తీసుకోవచ్చు..ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. 2004 సంవత్సరం నుంచి ఆ పైన చదివిన వారికి మాత్రమే ఈ విధానం అనేది అమల్లో ఉంటుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: