స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) స్టెనోగ్రాఫర్ C & D పరీక్ష 2022 కోసం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేయడం జరిగింది.ఇక ఈ నోటిఫికేషన్ ప్రకారం రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది ఆగస్టు 20, 2022 నుంచి ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 5, 2022 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ssc.nic.inని సందర్శించి అప్లై చేసుకోవచ్చు.స్టెనోగ్రాఫర్ గ్రేడ్ C ఇంకా అలాగే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ D పోస్టులు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఉన్న అనుబంధ ఇంకా అలాగే సబార్డినేట్ కార్యాలయాలతో సహా కేంద్ర ప్రభుత్వంలోని మంత్రిత్వ శాఖలు/విభాగాలు/సంస్థల్లో ఉన్నాయి. ఈ పోస్టులకి అప్లై చేయడానికి అభ్యర్థులు రూ.100 రుసుము అనేది చెల్లించాలి. షెడ్యూల్డ్ కులం (SC), షెడ్యూల్డ్ తెగ (ST), వికలాంగులు (PWD), ఎక్స్-సర్వీస్‌మెన్ (ESM) ఇంకా అలాగే మహిళా అభ్యర్థులు చెల్లింపు నుంచి మినహాయింపు అనేది ఉంటుంది.ఇక వయోపరిమితి గురించి మాట్లాడితే.. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి కోసం అభ్యర్థి వయస్సు ఖచ్చితంగా కనీసం 18 సంవత్సరాలు ఉండాలి.


గరిష్ట వయోపరిమితి వచ్చేసి 30 సంవత్సరాలుగా పేర్కొన్నారు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ D కోసం అభ్యర్థి వయస్సు కనీసం ఖచ్చితంగా 18 సంవత్సరాలు ఉండాలి. ఇంకా గరిష్ట వయోపరిమితి 27 సంవత్సరాలుగా పేర్కొన్నారు. ఇక అభ్యర్థుల వయస్సు జనవరి 1, 2022 నుంచి లెక్కలోకి వస్తుంది.ఈ పోస్టుల క్వాలిఫికేషన్‌ గురించి చెప్పాలంటే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి ఖచ్చితంగా 12వ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.ఇంకా అలాగే SSC స్టెనోగ్రాఫర్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ ఓపెన్ కాంపిటీటివ్ కంప్యూటర్ బేస్డ్‌గా ఉంటుంది. ఈ పరీక్ష నవంబర్ 2022లో జరుగుతుంది. ఇంకా అలాగే స్టెనోగ్రఫీలో నైపుణ్యం ఉన్న అభ్యర్థులు మాత్రమే స్టెనో పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి కూడా అర్హులు. ఖాళీగా ఉన్న పోస్టుల గురించి ఇంకా సమాచారం అనేది ఇవ్వలేదు. కానీ SSC తన వెబ్‌సైట్‌లో ఖాళీ పోస్టుల గురించి అతి త్వరలో సమాచారం వెల్లడిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

SSC