కార్పొరేట్ రంగంలో మంచి ఉద్యోగం సాధించి దూసుకుపోవాలంటే ఖచ్చితంగా ప్రస్తుత ఇండస్ట్రీలో డిమాండ్ ఉన్న రంగాలు, నియామక సమయంలో సంస్థలు ప్రధానంగా దేని మీద దృష్టిసారిస్తున్నాయనే అంశాలపై కూడా అవగాహన ఉండాలి. వీటితో పాటు మంచి నెట్‌వర్కింగ్ స్కిల్స్ ఉంటే.. ఫ్రెషర్స్ త్వరగా ఉద్యోగం సంపాదించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఫ్రెషర్స్‌ను రిక్రూట్  చేసే సమయంలో కంపెనీలు వారిలో ఎలాంటి స్కిల్స్ టెస్ట్ చేస్తాయనే అంశంపై ఒక సర్వే చేపట్టింది ప్రముఖ ఎడ్‌టెక్  కంపెనీ టీమ్‌లీజ్. 'కెరీర్ అవుట్‌లుక్' పేరుతో నిర్వహించిన ఈ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.భారతదేశంలోని దాదాపు 59 శాతం కంపెనీలు ఫ్రెషర్లను వివిధ జాబ్ రోల్స్‌కు నియమించుకోవాలని భావిస్తున్నాయని కెరీర్ అవుట్‌లుక్ సర్వే తేల్చింది. ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఎస్ఈవో (SEO), బ్లాక్‌చెయిన్, బిజినెస్ అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో ఫ్రెషర్లకు గణనీయమైన డిమాండ్ ఉందని రిపోర్టు పేర్కొంది. ఫ్రెషర్లకు అత్యంత స్థిరమైన మార్కెట్‌లలో ఇండియా ఒకటని, 2022 జూన్ నుంచి టాలెంట్ ఉన్న ఫ్రెషర్స్‌కు డిమాండ్ నిరంతరం పెరుగుతోందని సర్వే వెల్లడించింది.


ఐటీ, ఇ-కామర్స్ రంగాలు దేశవ్యాప్తంగా ఫ్రెషర్స్ నియామకానికి ఎక్కువగా మొగ్గుచూపుతున్నాయని, ప్రధానంగా బెంగుళూరు, ముంబై, ఢిల్లీ , చెన్నై, హైదరాబాద్‌ వంటి మెట్రో నగరాల్లో అత్యధిక ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని సర్వేలో తేలింది. అఫిలియేట్ మార్కెటింగ్ స్పెషలిస్ట్, సైట్ రిలయబిలిటీ ఇంజనీర్, మాలిక్యులర్ బయాలజిస్ట్, యూజర్ ఎక్స్‌పీరియన్స్ రీసెర్చర్, ఎమ్‌ఎల్ ఇంజనీర్ వంటి వాటి డొమైన్లలో కూడా ఫ్రెషర్స్‌కు అత్యధిక డిమాండ్ ఉన్న రోల్స్ ఉన్నాయని సర్వే పేర్కొంది.ప్రస్తుత రిక్రూట్మెంట్ ట్రెండ్స్‌పై టీమ్‌లీజ్ ఎడ్‌టెక్ వ్యవస్థాపకుడు, సీఈవో శంతను రూజ్ మాట్లాడారు. సైబర్ సెక్యూరిటీ అండ్ ఎథికల్ హ్యాకింగ్, బిజినెస్ అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ ఇంకా అలాగే బ్లాక్‌చెయిన్ వంటి డొమైన్‌లలో నైపుణ్యాలు ఉన్నవారికి అద్భుతమైన డిమాండ్‌ ఉందన్నారు. హై-డిమాండ్ స్కిల్స్, ఉద్యోగాలపై స్పష్టతతో, ఇప్పుడు డైనమిక్ జాబ్ మార్కెట్‌ను ఫ్రెషర్స్ వ్యూహాత్మకంగా నావిగేట్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. రిక్రూటర్లు కూడా ఇలాంటి స్కిల్స్‌ను టెస్ట్ చేస్తాయని తెలిపారు. టెక్నాలజీ -లెడ్ స్కిల్స్ అనేవి ఫెషర్స్ డిమాండ్ పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: