చిన్న ఉద్యోగం అయినా పెద్ద ఉద్యోగం అయినా ఇంటర్వ్యూకి వెళ్లేటప్పుడు తప్పకుండా కొన్ని విషయాలను చాలా సీరియస్ గా తీసుకోవాలి.ఇంటర్వ్యూకి సమయపాలన అనేది చాలా అవసరం.ఇంటర్వ్యూ ఏ సమయానికి ఉంది. సంబంధిత కంపెనీ వారు ఏ సమయానికి రమ్మన్నారు అనేది చాలా ముఖ్యం. వారు పిలిచిన సమయానికి కంటే ముందుగానే వెళ్లాల్సి ఉంటుంది. అవసరమైతే నిర్ణీత సమయానికి ఓ 15 నుంచి 20 నిమిషాలు ముందుగా అక్కడ ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. మనం వెళ్లే మార్గంలో ట్రాఫిక్ ఎక్కువుగా ఉండేటట్లు అయితే మనం ఇంటి నుంచి బయలుదేరే సమయాన్ని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా మన సమయపాలనను కూడా పరిశీలించే ఛాన్సెస్ ఎక్కువుగా ఉంటాయి. వారు పిలిచిరన సమయం కంటే ఆలస్యంగా వెళ్తే మన మీద సదాభిప్రాయం కలిగే అవకాశాలు తక్కువ. కొన్నిసార్లు ఇంటర్వ్యూకు ఎక్కువ మంది వచ్చేటట్లు అయితే ముందుగా వెళ్లిన వారిని ఇంటర్వ్యూకు ముందుగా పిలిచే ఛాన్స్ ఉంటుంది. ఇంటర్వ్యూల ప్రారంభంలో ఇంటర్వ్యూ చేసే ప్యానల్ కి ఎక్కువ ఓపిక ఉంటుంది. దీంతో మొదట్లో చేసే ఇంటర్వ్యూలు ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో పాటు.. ఆసక్తిగా ఉంటాయి.


ఇక ఇంటర్వ్యూలో సందర్భాన్ని బట్టి ప్రశ్నలు అడుగుతారు. మనం ఊహించినవి దాదాపు మనకు ఎదురుకాకపోవచ్చు. అయితే వారు ఎలాంటి ప్రశ్న అడిగిన తడుముకోకుండా మనం సమాధానం చెప్పాలి. ఒక వేళ ఆ ప్రశ్నకు సమాధానం తెలియకపోతే తెలియదని చెప్పేయడం ఉత్తమం. అలా కాకుండా మనకు తెలియకపోయినా.. తెలిసినట్లు ఏదో చెబుదామన్నట్లు నటిస్తే మన నటను అవతలివారికి ఈజీగా తెలిసిపోతుంది. అందుకే సమాధానం తెలిస్తే వెంటనే సమాధానం చెప్పడం, తెలియకపోతే తెలియదని చెప్పడం మంచిది.ఎక్స్ పీరియన్స్ విషయంలో కొంత మంది ఎక్కువుగా చేసే పొరపాటు ఉన్న ఎక్స్ పీరియన్స్ కంటే ఎక్కువుగా పేర్కొంటారు. కొన్ని సందర్భాలో నిశితంగా పరిశీలిస్తే మనం పేర్కొన్న అనుభవం సరైనదా లేదా ఫేక్ నా అనేది అవతలివారికి ఈజీగా తెలిసిపోయే అవకాశం ఉంటుంది.దీంతో మనపై విశ్వాసం ముందుగానే పోతుంది. మన ఆ ఉద్యోగానికి అన్ని విధాలా అర్హులైనప్పటికి.. కొన్ని సందర్భాల్లో మనం తప్పుడు సమాచారం ఇస్తే అది మనకు వేటు చేసే అవకాశం ఎక్కువ. అందుకే రెజ్యుమ్ లో పేర్కొన్న ప్రతి అంశం ఫర్ ఫెక్ట్ గా ఉండేలా చూసుకోవాలి.


మరొక ముఖ్యమైన అంశం ఇప్పుడు చాలా ఇంటర్వ్యూల్లో మన డీటెయిల్స్ తో పాటు మన ఫ్యామిలీ, సోషల్ బ్యాక్ రౌండ్ ఏమిటనేది తప్పనిసరిగా అడుగుతున్నారు. ఈవిషయాలు మన రెజ్యుమ్ లో పొందుపర్చనప్పటికి.. ఆవిషయాలు తప్పనిసరిగా అడుగుతారనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కంగారు పడకుండా సమాధానం చెప్పడానికి ప్రిపేర్ అయి వెళ్లాల్సి ఉంటుంది.మనకు సంబంధించిన బయోడెటా (రెజ్యుమ్)ను తప్పకుండా ముందే ప్రిపేర్ చేసుకోవాలి. రెజ్యుమ్ లో ఎటువంటి తప్పులు లేకుండా మనకు సంబంధించిన విషయాలన్ని కవర్ అయ్యేలా చూసుకోవాలి. మన విద్యార్హతలతో పాటు ఇప్పటివరకు మనం ఏదైనా సంస్థలో పనిచేశామా లేదా సొంతంగా ఏదైనా వ్యాపారం లాంటివి చేశామా అనే డీటెయిల్స్ రెజ్యుమ్ లో ఉండేలా చూసుకోవాలి. మరొకటి మన కమ్యూనికేషన్ డీటెయిల్స్ తప్పకుండా రెజ్యుమ్ లో ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే మనకు కమ్యూనికేషన్ అందించడానికి మన మొబైల్ నెంబర్, ఈ-మెయిల్ ఐడి తప్పకుండా ఉండేలా జాగ్రత్త పడాలి. ఒక్కోసారి ఫోన్ పనిచేయకపోయినా.. మన ఈ మెయిల్ కు కమ్యూనికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మనకున్న టెక్నికల్ నాలెడ్జ్ ఏదైనా ఉంటే దానిని స్పష్టంగా రెజ్యుమ్ లో పేర్కొనాలి. వృత్తి పరమైన నైపుణ్యాన్ని తప్పకుండా పేర్కొనాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: