9 నుంచి 12 తరగతి విద్యార్థులకు సూపర్ గుడ్ న్యూస్?

ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు చాలా చక్కటి సదవకాశం. వారికి 9వ తరగతి నుంచి ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ వరకు స్కాలర్షిప్‌ పొందే అవకాశం ఉంది. ఇంతకీ ఈ స్కాలర్‌షిప్‌ పొందడానికి అర్హతలు ఏంటి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఇంకా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.8వ తరగతి చదువుతున్న లక్ష మంది విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్‌లను అందిస్తారు. పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఈ స్కాలర్‌షిప్‌ అందిస్తారు. నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్స్‌లో భాగంగా ఈ ప్రోత్సహకాలు అందిస్తారు. తాజాగా 2022-23కి సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల చేశారు.కేంద్ర మానవ వనరుల విభాగానికి చెందిన స్కూల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ లిటరసీ విభాగం అందించే ఈ స్కాలర్‌షిప్స్‌ కోసం దరఖాస్తు చేసుకునే వారి విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.3.5 లక్షలకు మించకూడదు. 


ప్రస్తుతం 8వ తరగతి చదువుకుంటున్న విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌ పొందడానికి అర్హులు. ఏడవ తరగతిలో 55 శాతం, ఎస్సీ, ఎస్టీలైతే 50 శాతం మార్కులతో పాస్‌ అయ్యి ఉండాలి. ఈ పరీక్షను దేశంలోని పలు రాష్ట్రాల్లో జరుపుతారు.మొత్తం స్కాలర్‌షిప్స్‌కు గాను రాష్ట్రాల జనాభా ప్రాతిపదికగా విభించారు. రెండు తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో 4087, తెలంగాణలో 2921 మందికి స్కాలర్‌షిప్స్‌ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఇప్పటికే దరఖాస్తులను స్వీకరిస్తుండగా, తెలంగాణలో స్వీకరణ త్వరలోనే ప్రారంభం కానుంది. ఏపీలో దరఖాస్తుల స్వీకరణకు అక్టోబర్‌ 31ని చివరి తేదీగా నిర్ణయించారు. పరీక్ష తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు https://www.bse.ap.gov.in, తెలంగాణ విద్యార్థులు https://www.bse.telangana. gov.in వెబ్‌సైట్‌ నుంచి అప్లై చేసుకోవాలి.కాబట్టి ఖచ్చితంగా ఈ స్కాలర్ షిప్ పొందడానికి అర్హత కలిగిన 9 నుంచి 12 వ తరగతి దాకా చదువుతున్న విద్యార్థులు అప్లై చేసుకోండి. ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: