ప్రసాదంలో సైనైడ్‌ పెట్టి వరుస హత్యలతో రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన సీరియల్‌ కిల్లర్‌ సింహాద్రి అలియాస్‌ శివ కేసులో విస్మయం కలిగించే వాస్తవాలు ఆలస్యంగా వెలుగుచూస్తున్నాయి. హత్యల విచారణలో పోలీసుల తీవ్ర నిర్లక్ష్యం హత్యల పరంపరకు తోడ్పడిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏలూరులో ఫైనాన్స్‌ కంపెనీ గుమస్తా చోడవరపు సూర్యనారాయణ హఠాత్తుగా మృతిచెందాడు.


ఇది కిల్లర్‌ సింహాద్రి చేసిన ఐదో హత్య. ఇది హత్యేనని సూర్యనారాయణ కుటుంబసభ్యులు, బంధువులు పోలీసులకు ఎంత చెప్పినా పట్టించుకోలేదు. ఇదే అదనుగా కిల్లర్‌ సింహాద్రి మరో ఐదు ప్రాణాలు బలితీసుకున్నాడు.ప్రతిచిన్న అంశాన్నీ బూతద్దంలో చూడటం.. అనుమానం వచ్చిన ప్రతి వ్యక్తిని విచారించడం.. అతనిపై నిఘా పెట్టడం.. అవసరమైతే నయానో భయానో నిజం రాబట్టడం.. పోలీసుల నిత్యకృత్యం.


అయితే సైనైడ్‌ కిల్లర్‌ సింహాద్రి విషయంలో పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు. ఫలితంగా పది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. బాధితులే కిల్లర్‌ ఇల్లు చూపించినా పోలీసులు పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసులను కూడా కిల్లర్‌ తనకు అనుకూలంగా మార్చుకున్నాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.గతంలో ఉన్న పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


సైనైడ్‌ కిల్లర్‌ను ప్రస్తుత పోలీసులు చాకచక్యంగా పట్టుకోగా..  కానీ పోలీసులు  వేరేగా చెపుతున్నారు. కొందరు గుండెపోటుతో మృతిచెందారని భావించిన మృతుల కుటుంబ సభ్యులు ఫిర్యాదులు చేయలేదు.   హత్యల నిందితుడు వెల్లంకి సింహాద్రిని ఇంకా పూర్తిస్థాయిలో విచారణ చేసేందుకు పోలీస్‌ కస్టడీ కోరుతూ కోర్టుకు వినతి చేశాం. సింహాద్రి ఈ జిల్లాలోనే కాకుండా కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లోనూ హత్యలకు పాల్పడ్డాడు. హత్యల వెనుక కారణాలు ఏమిటనేది విచారణ చేసి తెలుసుకుంటాం. ఇప్పటి వరకూ పోలీసులకు ఫిర్యాదు చేయని మృతుల బంధువుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, కేసులు నమోదు చేసేందుకు చర్యలు చేపడతాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: